ఒకప్పుడు లిప్ లాక్ సీన్లు అంటే ఒక్క హాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయి ఉండేవి.... ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఈ లిప్ లాక్  సీన్ల సంప్రదాయం పాకింది ఇక ఆ తర్వాత... అన్ని ఇండస్ట్రీ లలో లిప్ లాక్  సీన్లు కామన్ అయిపోయాయి. ఇక మన టాలివుడ్ సినిమా ఇండస్ట్రీ లో అయితే లిప్ లాక్ అంటే ఆమడ దూరం ఉండే హీరోయిన్లు... ఇప్పుడు జాలిగా లిప్ లాక్ సీన్లు చేసేస్తున్నారు. ఇక లిప్ లాక్ సీన్లకు అలవాటు పడిన ప్రేక్షకులు కూడా... రొమాన్స్ ఎంత ఉన్నప్పటికీ లిప్ లాక్ సీన్స్ లేకపోతే ఆబ్బె అంత బాగానే ఉంది కానీ ఎదో మిస్ అయింది అని పెదవి విరుస్తున్నారు. 

 

 

 

 

 

ఇక ఇప్పటి కథానాయికలు ముద్దు సీన్లకు అభ్యంతరం కూడా చెప్పకపోతుండడం... ఏ సినిమాలో చూసినా లిప్ లాక్ సీన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మిల్కీబ్యూటీ తమన్నా మాత్రం ముద్దు సీన్లు వద్దు అంటుంది. తన అందచందాలతో ప్రేక్షకులల్లో  మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది తమన్నా .ఎన్నో గ్లామర్ రోల్స్ లో నటించి తన అందాలతో మతి పోగొట్టింది తమన్నా.  అయితే ప్రస్తుతం పాపులర్ అవుతున్న లిప్ లాక్ సీన్ లపై  తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు. 

 

 

 

 

 

 తను పదమూడేళ్ల వయసులోనే హీరోయిన్ గా  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చానని ... అప్పుడే ముద్దు సీన్లలో, ఇంటిమేటెడ్ సీన్లలో  నటించకూడదని అప్పుడే నిర్ణయించుకున్నానని... ఇప్పటివరకు తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తమన్నా  తెలిపింది . ఇప్పటివరకు లిప్ లాక్ సీన్లలో నటించడానికి ఒప్పుకోలేదు అని చెప్పింది. గ్లామర్ ఎక్స్పోస్ చేసే విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదని.. కానీ ముద్దు విషయంలో మాత్రం దర్శకులకు కుదరదు అని చెబుతాను అంటుంది .తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కూడా తానెప్పుడూ అనుకోలేదని చెప్పింది తమన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: