తెలుగు తెరకు హీరోగా పరిచయమై సక్సెస్ అందుకోలేక విలన్ గా అవతారమెత్తి సక్సెస్ ఫుల్ విలన్ అనిపించుకున్న నటుడు గోపీచంద్. అయితే విలన్ గా మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో మళ్ళీ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో తానేంటో నిరూపించుకున్నాడు. అప్పటి నుండి వరుసగా హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మొదట్లో వరుస హిట్లతో ఫామ్ లో ఉన్న గోపీ చంద్ తర్వాత్తర్వాత విజయాలు లేక రేసులో వెనకబడిపోయాడు.


గోపీచంద్ యజ్ఞం, రణం సినిమాలు చేసినపుడు యాక్షన్ సినిమాల ట్రెండ్ బాగా నడిచింది. అందువల్ల ఆ సినిమాలు అప్పట్లో పెద్ద హిట్టయ్యాయి. ఆ తర్వాత కాలం మారింది. తెలుగు చిత్ర పరిశ్రమలో మూస కథలకి కాలం చెల్లింది. కొత్త కథలు వస్తున్నాయి. కొత్త దర్శకులు కొత్త ట్రీట్ మెంట్ తో వస్తున్నారు. ప్రేక్షకులు కూడా వాటినే కోరుకుంటున్నారు. కొత్త సీసాలో పాత సారా పోస్తే ఎవ్వరూ యాక్సెప్ట్ చేయట్లేదు. 


కానీ గోపీ చంద్ ఇప్పటికీ పాత మూస కథల్నే నమ్ముకుని ఉండటం వల్ల ఆయన మార్కెట్ బాగా పడిపోయింది. ఇంతకు ముందు గోపీచంద్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు గోపీ చంద్ సినిమా వస్తుందంటే మరో ఫ్లాప్ తో వస్తున్నాడా అని మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితికి కారణం గోపీచంద్ ఎంచుకునే కథలే. పాత వాటిని పక్కన పెట్టి కొత్త వైపుగా ప్రయాణిస్తే గాణి గోపీ చంద్ రేసులో నిలబడలేడు.


మొన్నటికి మొన్న వచ్చిన చాణక్య సైతం గోపీచంద్ ని కాపాడలేకపోయింది. సైరాతో పోటీగా వచ్చిన ఈ సినిమాకి ఆదిలోనే దెబ్బ తగిలింది. ఇప్పుడు పోటీకి కాదు కదా కనీసం విడుదల అయిన విషయం కూడా ఎవరికి తెలియట్లేదు. అయితే ఇవన్నీ పక్కన పెడితే గోపీ చంద్ తన తర్వాతి సినిమాలోనైనా కొత్త రకం కాన్సెప్టుతో వచ్చి ప్రేక్షకులని అలరిస్తాడని ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: