నవీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న చిత్రం "వనవాసం". భరత్ కుమార్.పి  నరేంద్ర దర్శకత్వం లో శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ నెం: 1 సంజయ్ కుమార్. బీ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అక్టోబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


ఈ సందర్భంగా  డైరెక్టర్ “భారత్ కుమార్ .పి” మాట్లాడుతూ.. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ని తీయడం జరిగింది.  ఈ ట్రైలర్  లాగానే సినిమా కూడా మీ అందరూ మెచ్చే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను అని అన్నారు.


నిర్మాత "సంజయ్ కుమార్ .బీ" మాట్లాడుతూ..సినిమా మేము అనుకున్న దానికంటే చాల అద్భుతంగా  తెరకు ఎక్కించారు అక్టోబర్ 25న  ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధం గా ఉన్నాం అని నిర్మాత "సంజయ్ కుమార్. బీ" చెప్పారు.  
  
హీరో నవీన్ రాజ్ శంకరాపు మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ గారికి  ఎప్ప‌టికి రుణపడి ఉంటాను ఇంకా మా కోసం కష్టపడిన మా టీం అందరి కోసం అయినా మంచి ఫలితం  వస్తుంది అని నముతున్న మా ఈ ప్రయత్నాని మీరంతా చూసి మమ్మలిని ఆశీర్వదిస్తారు. అక్టోబర్ 25న మీ ముందుకు వస్తున్న మా వనవాసం టీం కి  మీ అందరి ఆశీర్వాదం కావాలి అని అన్నారు. 


పి.ఆర్.ఒ: "మధు వి.ఆర్" సంగీతం "ఎం.ఎం.కుమార్", సినిమాటోగ్రఫీ "ప్రేమ్ జై  విన్స్Oట్  "ఎడిటర్ "ప్రభుష‌ పోస్టర్స్ మరియు ట్రైలర్ "నాగ విజయ్ కుమార్.ఎం. గ‌తంలో య‌దార్ధ సంఘ‌ట‌న‌ల పైన చాలా చిత్రాలే ఉన్నాయి. మ‌రి ఈ చిత్రంలోని విశేష‌త ఏమిటి అన్న‌ది సినిమా చూస్తే తెల‌స్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: