అమ్మాయి అయితే చాలు వేరేదాన్ని నేను పట్టించుకోను.. పెళ్ళికి నేను రెడీ అంటున్న బాలీవుడ్ అగ్ర హీరో నవాజ్జుద్దీన్ సిద్ధుకి. అసలేంటి ఆయన ఈ  వయసులో కూడా అమ్మాయికోసం చూస్తున్నారా అని అనుకుంటున్నారు కదా అదేం లేదండి. ఆయన, అతియా శెట్టి జంటగా నటించిన సినిమా 'మోతీచూర్, చక్నాచూర్'. ఈ సినిమాను దెబ్మిత్రా బిస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. 


ఇక 36 ఏళ్ళు వచ్చిన పెళ్లికాని బ్రహ్మచారిగా ఉన్నఓ మాగాడి జీవితాధారంగా ఈ కథ మొదలవుతుంది. మాములుగా ఈ కథ చూడటానికి వినడానికి కొత్తగా అనిపిస్తుందిగా అంతే విదంగా అమితమైన కామెడీతో కూడా ఉంటుంది. లెట్ మ్యారేజ్ అంటే ఎవరికైనా ఒకటే మాట తడుతుంది. అదే ఏదైనా లోపాలున్నాయేమో అందుకే పెళ్ళికాలేదు అని అనుకుంటారు. కానీ, అమ్మాయి ఎలా ఉన్నా కూడా, పైన బట్ట కింద పొట్ట ఉన్న కూడా నాకు ఓకే నాకు పెళ్లిచేసుకోవడానికి అమ్మాయి కావలి అంతే అని హీరో అంటారు. 


హీరో ట్రేలర్ లో అన్న మాటలు వినడానికి మరియు చూడటానికి కామెడీగా ఉంది. ఇకపోతే అమెరికాకి వెళ్లాలని కళలు కంటున్నా అమ్మాయి పాత్రలో నటిస్తుంది అమిత. నవాజ్ దుబాయిలో ఉన్నారనే నమ్మకంతో అతని బ్యాగ్ గ్రౌండ్ తెలియకుండా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వస్తుంది. ఆ తర్వాత నిజం తెలుసుకొని భాద పడుతుంది. ఆ తర్వాత వచ్చే సీన్స్ మాత్రం హైలెట్ గా ఈ సినిమాలో చూపించారు. 



నా పొలంలోకి వచ్చిన మొలకల్ని మొగ్గలోనే తుంచేస్తావా.. దొరక్క దొరక్క ఒక అమ్మాయి దొరికింది అలాంటిది అమ్మాయిని కూడా నువ్వు లాగేసుకొని పోతావా అంటూ హీరో చివర్లో చెప్పిన డైలాగు ఆద్యంతం కామెడీగా అనిపిస్తుంది. ఆ సినిమా మొత్తం కొంచం కథ విన్నట్లే ఉన్నా గాని, లెట్ మ్యారేజ్ వల్ల కలిగే నష్టాలు గురించి క్లుప్తంగా ఈ సినిమాలో చూపించారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల 15 న రిలీజ్ కాబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: