నందమూరి బాలకృష్ణ నిజంగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పాటపై పడ్డాడు. అసలు ఆయనేంటి.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై కన్నేయడం ఏంటి అని అనుకుంటున్నారా..? ఇప్పుడు బాలయ్య కెయస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక  సినిమా చేస్తున్నాడు అని అందరికి తెలిసిందే కదా. ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ కూడా అయ్యాడు బాలయ్య. 


నిజానికి  అక్కడ ఉన్నది  బాలయ్యేనా అని అభిమానులు కూడా ఆక్షర్యపోతానునారు. బాలయ్య ఈ సినిమా కోసం 11 కేజీలు బరువు కూడా తగ్గిపోయాడు నందమూరి నటసింహం. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల అవుతుంది. ఇక ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు రావడంతో టైటిల్ కోసం ఇబ్బందిల్లు పడుతున్నాడు దర్శకుడు.


గతంలో  బాలయ్యతో కలిసి చేసిన సినిమాకు జై సింహా అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టి హిట్ దక్కించుకున్నారు.ఈ సినిమాకి  కూడా  ఇలాంటి పవర్ ఫుల్ టైటిల్ కోసమే చూస్తున్నాడు రవికుమార్. దీనికి ముందు బాలయ్య సింహా, లెజెండ్, డిక్టేటర్ లాంటి పవర్ ఫుల్ టైటిల్స్ తో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు రూలర్ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారు. దాంతో పాటు జడ్జిమెంట్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది కానీ అందరికి  మాత్రం రూలర్ వైపు ఉంది. ఇందులో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది కథ.


గతంలో గోపీచంద్ గోలీమార్ కూడా ఇదే కథ అనుసరించి  వచ్చింది. ఇప్పుడు బాలయ్య కూడా ఇంచుమించు ఇదే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీనికి రూలర్ అనే టైటిల్ పెట్టాలంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ పాట గుర్తుకొస్తుంది అందరికి. బోయపాటి 'దమ్ము' సినిమాలో రూలర్ అనే పాట ఉంది. ఇప్పుడు ఇదే పాటలోని పదాన్ని బాలయ్య సినిమా కోసం వాడుకుంటున్నాడనేది చాల గమనించ వలసిన అంశం. మరి దీనికి నందమూరి ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: