టాలీవుడ్ లో నాచురల్ స్టార్ గా పేరుగాంచిన నాని హీరోగా ఇటీవల వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా పర్వాలేదనిపించేలా కలెక్షన్స్ ని సాధించడం జరిగింది. దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడం జరిగింది. నిజానికి ఆ సినిమాలో ఆకట్టుకునే అంశాలు ఉన్నప్పటికీ, తాము దర్శకుడు విక్రమ్ నుండి ఆశించిన థ్రిల్లింగ్ మరియు సస్పెన్స్ అంశాలు గ్యాంగ్ లీడర్ లో లేవని కొందరు ప్రేక్షకులు సినిమాపై పెద్దగా ఆసక్తి చూపలేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, శరణ్య మోహన్, ఆర్ఎక్స్ 100 మూవీ ఫేమ్ కార్తికేయ, ప్రియదర్శి, తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించడం జరిగింది. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తన తదుపరి సినిమాపై గట్టిగా దృష్టి పెట్టాడు నాని. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబుతో కలిసి వి అనే వెరైటీ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న నాని, మరొక సెన్సేషనల్ మూవీ కి పచ్చ జండా ఊపినట్లు నేడు పలు టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. 

ఇటీవల తనతో కలిసి నిన్నుకోరి సినిమాను తీసిన శివ నిర్వాణ, నాని మరియు మరొక హీరోల కలయికలో మల్టీస్టారర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు చెప్తున్నారు. అయితే నానితో పాటు నటిస్తున్న ఆ హీరో ఎవరన్నది అతి త్వరలో తెలుస్తుందని, అలానే మరికొద్దిరోజుల్లో ఈ సినిమా అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం మంచి వెరైటీ సినిమాలతో ముందుకెళ్తున్న నాని, రాబోయే రోజుల్లో మరిన్ని వైవిధ్యమైన సినిమాల్లో నటించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఆయనకు ఈ సినిమాలు ఎంతమేర విజయాన్ని అందిస్తాయో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: