టాలీవుడ్ లో హ్యాపీడేస్ మూవీతో పరిచయం అయ్యింది తమన్నా.  తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా పెద్దగా హిట్ అందుకోలేకపోయింది.  100%లవ్ సినిమా కాస్త పరవాలేదు అనిపించుకుంది.  కెరీర్ ఇబ్బందులు తలెత్తకుండా ఐటమ్ సాంగ్స్ కి కూడా రెడీ అయ్యింది.  ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూ..మరోవైపు ఐటమ్ సాంగ్స్ లో నటిస్తుంది తమన్నా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాలో ముఖ్య లక్ష్మి నటించి మెప్పించింది.

‘సైరా’లో ఆ పాత్రకు ఎంతో మంచి పేరు రావడంతో తమన్నా ఉప్పొంగిపోతుంది.  ఈ నేపథ్యంలోనే తమన్నా తమిళంలో చేసిన 'పెట్రోమ్యాక్స్' సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్నానని చెప్పింది.  అయితే సినీ పరిశ్రమలో ఎన్నో పాత్రలు ఎంతో మంది హీరో సరసన నటించానని..కానీ ఒక్క కోరిక మాత్రం ఇంకా తీరడం లేదని చెప్పింది.

చాలా కాలం క్రితం విజయ్ తో కలిసి 'సుర' సినిమాలో నటించాను. ఆ సినిమాలో నా పాత్ర చాలా చిన్నది. పాటల షూటింగు సమయంలోను సెట్ కి వచ్చేసి డాన్సులు చేసేసి వెళ్లిపోయేదానిని..దాంతో విజయ్ ని కలిసే అవకాశం  దక్కలేదని వాపోయింది. దు. ఆయనతో మరోసారి జోడీ కట్టాలని వుంది. అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: