తమిళ స్టార్ హీరో కార్తి  హీరోగా  లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో   తెరకెక్కుతున్న చిత్రం 'ఖైదీ'. ఖైదీ చిత్రం కూడా ఆయన వైవిధ్యంగా తెరకెక్కించారు. ఈ మూవీ కథ మొత్తం ఒక రాత్రి నేపథ్యంలో నడుస్తుంది. అసలు డే షాట్ నే ఈ మూవీలో ఉండకపోవడం గమనార్హం.  జైలు నుండి తప్పించుకున్న ఖైదీగా కార్తీక్ నటిస్తుండగా, ఒకవైపు పోలీసులు, మరోవైపు రౌడీ ముఠా అతని కోసం వెతుకుతూ ఉంటారు. ఈ మూవీలో పాటలు, మరియు హీరోయిన్ కూడా ఉండదని సమాచారం. కాగా ఈ మూవీ ట్రైలర్ కి డేట్ ఫిక్స్ చేశారు. సోమవారం ఉదయం 10:25 నిమిషాలకు ఖైదీ ట్రైలర్  విడుదల చేయనున్నారు. ఈమేరకు పోస్టర్ విడుదల చేయడం జరిగింది.  కాగా ఈ చిత్రాన్ని దీపావళి పండుగ సందర్భంగా  అక్టోబర్ 26 న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న  ఈ సినిమాలో స్టోరీ చాల కొత్తగా ఉంటుందట.  


 డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం ఫై  ఎస్ ఆర్ ప్రభు  నిర్మిస్తున్న ఈ చిత్రానికి  సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ డిఫరెంట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.  తెలుగులో మంచి మార్కెట్ ఉన్న హీరోలలో హీరో కార్తీ ఒకరు. యుగానికి ఒక్కడు, నాపేరు శివ, ఆవారా వంటి చిత్రాలు ఆయనకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.  ఇక  కార్తీ సినిమా అంటే కామెడీ, అందమైన హీరోయిన్లు, ఉర్రూతలూ గించే పాటలు తప్పనిసరి. అలాంటిది కార్తీ కెరీర్‌లో తొలిసారిగా పాటలు, హీరోయిన్‌ లేకుండా ఒక సినిమా చేశారు. మరి ఈ ప్రయోగం ఎలా ఉంటుందో చూడాలి.  ఇక  కార్తి ఈ సినిమాతో  దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్  డైరెక్షన్ లో  కూడా ఓ సినిమా చేస్తున్నాడు. మొత్తానికి మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న కార్తికి  ఈ సినిమాతో  ఏ రేంజ్ హిట్ సాధిస్తాడో.  


మరింత సమాచారం తెలుసుకోండి: