ప్రభాస్‌కు అప్పులేంటి అనుకుంటున్నారా? ఆయన ఎంత ఆస్తిపరుడు అనేది ప్రత్యేకంగా చెప్పవలిసిన అవసరమా? ఒక్క సినిమా తేడా కొడితే అప్పుల్లో పడిపోవడం ఏంటి మరీ పిచ్చి కాకపోతేనూ అనిపిస్తుందా? నిజమే కావచ్చు కానీ భారీ సినిమాలు నిర్మించేటప్పుడు సొంత డబ్బుల కంటే కూడా బయటి నుంచి తీసుకొచ్చిన మొత్తాన్నేబడ్జెట్‌గా పెడుతుంటారు నిర్మాతలు, సహా నిర్మాతలు. ప్రస్తుతం ఇప్పుడు సాహో విషయంలోనూ ఇదే జరిగింది.


సాహూ చిత్రం ఖచ్చితంగా సంచలన విజయం సాధిస్తుందని నమ్మి లాభాల్లో వాటా తీసుకోవాలనుకున్నాడు హీరో ప్రభాస్. కానీ ఇక్కడ ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా ప్రభాస్ సన్నిహిత సంస్థ యూవీ క్రియేషన్సే. దానీతో పారితోషికం కూడా తీసుకోలేదు ఈ రెబల్ స్టార్. అయితే సాహో విడుదలై నాలుగు వందల కోట్లకు పైగా వచ్చాయనే ప్రచారం జరిగినా కూడా అంత రాలేదనేది మాత్రం బయటికి బాగా వినిపిస్తున్న మాట. 


ఇది ఇలా ఉంటే సాహూ చిత్రం తెలుగులో దారుణంగా డిజాస్టర్ అయింది అని అందరికి తెలిసిందే. పైగా అడ్వాన్స్ బేసిస్‌పై సినిమాను తీసుకోవడంతో డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫుల్ అమౌంట్ కూడా రాలేదు అని తెలుస్తోంది. మరి వచ్చినంత వరకు అలాగే ఉండి నష్టాలను నిర్మాతలు భరించాల్సి వస్తుందని తెలుస్తుంది ఇప్పుడు.


ఈ సినిమాపై డెబ్భై ఎనిమిది కోట్లు వడ్డీ ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కానీ నిజమైతే ప్రభాస్‌కు ఒక్క రూపాయి కూడా రాదు రాకపోగా పూచికత్తు ఇచ్చాడు కాబట్టి చేతుల్లోంచి కొన్ని కోట్లు వదిలించుకోవాల్సి వస్తుందని తెలుస్తుంది. నష్టం ఎంతైనా కూడా ప్రభాస్ భరిస్తాడేమో కానీ ఆయన అప్పుల్లో ఉండేంత సినిమా మాత్రం లేదంటున్నారు రెబల్అ స్టార్ అభిమానులు. మరి ఇందులో నిజం ఎంతుందో త్వరలోనే తెలవలిసి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల తొంభై కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం రెండు వందల ముప్ఫై కోట్ల షేర్ వసూలు చేసి అబౌ యావరేజ్ స్థాయిని అందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: