కొత్త సినిమా వచ్చిందంటే చాలు జబర్ దస్త్ హైపర్ ఆది అందులోకి దూరిపోతుంటాడు. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఇదే పని చేసాడు ఈయన. ముఖ్యంగా మెగా భజన చేయడంలో ఆది తర్వాతే ఎవరైనా అనుకోవాలి. అక్కడున్న నాగబాబును అక్కడ లేని మెగా హీరోలను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాడు హైపర్ ఆది. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. 


క్రితం రెండు వారాల కింద గద్దలకొండ గణేష్ పాత్రలో నవ్వించిన ఆది ఇప్పుడు ఏకంగా సైరా సన్నివేశం చేశాడు. వచ్చే వారం ఎపిసోడ్‌లో ఉయ్యాలవాడ గెటప్‌లో నవ్వించబోతున్నాడు ఈ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. ఇప్పటికే విడుదలైన ప్రోమో మంచి రెస్పాన్స్ వచ్చింది.


దీనికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే వచ్చే వారం కూడా సైరాతో ఆది నవ్వులు పూయించడం ఖాయమని యిట్టె అర్ధమవుతోంది. పైగా అందులోనే బాహుబలి, మగధీర లాంటి సినిమాలను కూడా మిక్స్ చేసాడు మన హైపర్ ఆది. దానికి తనదైన పంచులు తోడు కావడంతో స్కిట్ కడుపులు చెక్కలయ్యేలా తయారయింది. రెండు నిమిషాల ప్రోమోలో గ్యాప్ లేకుండా పంచ్ డైలాగులు వేసాడు హైపర్ ఆది. 


ప్రోమో చూసిన తర్వాత అభిమానులతో పాటు ఆది ఫాలోయర్స్ కూడా ఈ స్కిట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు అక్కడే ఉన్న నాగబాబు కూడా సైరా స్పూఫ్ చూసి కడుపు పగిలేలా నవ్వుకున్నాడు. ఏమైనా జబర్ దస్త్ హైపర్ ఆది మాత్రం ఎప్పటికప్పుడు కరెంట్ పాలిటిక్స్, సామాజిక సైట్స్ లో దొరికే కామెడీని ఇలా అన్ని విధాలుగా కొత్త కొత్తగా తనదయిన శైలిలో  ప్రపంచంలోని తెలుగు వారందరిని కడుపుబ్బా నవిస్తాడని ఎనువంటి అతిశయోక్తి లేదు. జబర్దస్ ఇంత పాపులర్ కావడంలో ఆది, వారి టీం మేబెర్స్ పెర్ఫామెన్స్ కూడా ఒక ముఖ్యమైన సంగతే అని తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: