ఆ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి ఆ ఉద్యమం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాలీవుడ్‌లో అంతలా బీభత్సం సృష్టించింది. క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది.  మంచి మూవ్ మెంట్ లో ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పై నోరు పారేసుకోవడంతో అంతా రివర్స్ అయ్యింది.  ఆమె వ్యక్తిగత దూషనలకు తెగబడుతుందని..కొంత మందిని కావాలనే టార్గెట్ చేస్తుందని ఆరోపణలు రావడం..పవన్ కళ్యాన్ పనికట్టుకొని శ్రీరెడ్డిపై ట్రోలింగ్ చేయడంతో ఇక్కడ మనుగడ సాగించలేక చెన్నైకి షిప్ట్ అయ్యింది.

అక్కడ కూడా ఆమె సెలబ్రెటీలపై తనదైన స్టైల్లో కామెంట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. ఒక్కోసారి ఆమె పెట్టే పోస్టులు, వాడే భాష రాయడానికి కూడా కష్టంగానే ఉంటుంది. మొన్న బోయపాటి..నిన్న రోజా నేడు సూపర్ స్టార్ రజినీకాంత్ పై సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చింది. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ పై కామెంట్స్ చేసింది.  ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండటంతో.. శ్రీరెడ్డి ఈ విషయంపై స్పందించింది.

రజినీకాంత్  గారూ.. ఇదేమీ సినిమా కాదు సస్పెన్స్ మెయింటెన్ చేయడానికి.. మీరు రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అన్న దానిపై క్లారీటీ ఇవ్వండంటూ ఓ పోస్ట్ పెట్టింది. రజినీకాంత్ గారూ.. మీరు గనక రాజకీయాల్లోకి  వస్తే.. నేను ఆ పార్టీలో జాయిన్ అవుతాను అంటూ మరో పోస్ట్ పెట్టింది. అయితే శ్రీరెడ్డి వేసిన ఈ స్కెచ్ భలే ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి రజినీ ఈమెకు అవకాశం ఇస్తారా? లేదా అన్నది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: