స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితం అవుతున్న ఈ సినిమాను, తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఎంటర్టైన్మెంట్ ని, అలానే తన మార్క్ పంచ్ డైలాగ్స్ తో మిక్స్ చేసి దర్శకుడు త్రివిక్రమ్ ఎంతో జాగ్రత్తగా తెరక్కిస్తున్నారు. గతంలో డిజెలో బన్నీ సరసన నటించిన భామ పూజ హెగ్డే, ఈ సినిమాలో మరొక్కసారి ఆయనతో జోడి కడుతోంది. 

బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే సినిమా యూనిట్ తెల్పింది. అయితే తమ సినిమాను జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు ఆ సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. బన్నీ సంక్రాంతి కోడి పుంజుని తన చేత్తో పట్టుకుని పోటీ సిద్ధం అవుతున్న ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. గతంలో త్రివిక్రమ్ మరియు బన్నీ ల కాంబినేషన్లో వచ్చిన జులాయి, 

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయవంతం అవ్వగా, వారిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా తప్పకుండా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడం ఖాయమని బన్నీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల థమన్ స్వరపరిచిన ఈ సినిమాలోని సామజవరగమనా అనే సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటూ మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించి, సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. మరి ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమా, ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: