బాలీవుడ్ హీరోయిన్స్ తో పోల్చితే మన సౌత్ హీరోయిన్స్ కి రెమ్యునిరేషన్ చాలా తక్కువగా ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంలో కొందరు హీరోయిన్స్ తమ గోడును అప్పుడప్పుడు వినిపిస్తుంటారు కూడా. 100-300 కోట్ల భారీ బడ్జెట్ సినిమాల్లో నటించే హీరోయిన్స్ కూడా రెమ్యునిరేషన్ విషయంలో అసంతృప్తిగానే ఉంటున్నారనే విషయం ఇండస్ట్రీలో అందరికి తెల్సిందే. హీరోలతో పాటు కష్టపడే హీరోయిన్స్ కు ఎందుకు తక్కువ రెమ్యునిరేషన్ అంటూ కొందరు ఈమద్య దర్శక, నిర్మాతలను నేరుగానే ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ కి రెమ్యునిరేషన్స్ భారీగానే ఉన్నా వాళ్ళు కూడా తమకు హీరోల రేంజ్ లో రెమ్యునిరేషన్ ఇవ్వడం లేదంటూ చెబుతున్నారు. ఇప్పుడు ఇదే విషయంలో రీసెంట్‌గా మన సౌత్ హీరోయిన్ ప్రియమణి స్పందించారు.

హీరోయిన్ గా తెలుగు.. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ప్రియమణి ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇటీవలే తను నటించిన 'ఫ్యామిలీ మాన్' వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో నటనకు గాను ప్రియమణి అందరి నుండి ప్రశంసలు దక్కించుకుంది. ఈ సందర్బంగా మాట్లాడిన ప్రియమణి మీటూ తో పాటు హీరోయిన్స్ కి ఇస్తున్న రెమ్యునిరేషన్ విషయాల మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

సౌత్ హీరోయిన్స్ లో సమంత... నయనతార.. అనుష్కలకు మాత్రమే పారితోషికం విషయంలో డిమాండ్ చేసే సత్తా ఉంది. వారు ఎంత కావాలంటే అంత రెమ్యునిరేషన్ తీసుకుంటారు. ఇతర హీరోయిన్స్ ఎవరికి కూడా పారితోషికం డిమాండ్ చేసేంత అవకాశం లేదని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అతి కొద్ది మంది మాత్రమే తమకు రావాల్సిన పారితోషికాలను నిర్మాతల నుండి ఖచ్చితంగా వసూళ్లు చేసుకోగలుగుతున్నారు. మిగిలిన చాలా మంది హీరోయిన్స్ నిర్మాతల వద్ద రెమ్యునిరేషన్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రియమణి అసలు విషయాన్ని బయటపెట్టారు.

మీటూ వల్ల పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. హీరోయిన్స్ లో ఉండే అభద్రత భావం మీటూ కారణంగా తొలగి పోయింది. కాని కొందరు మీటూ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయంగానే అనుకుంటున్నారు. అలాంటి అభిప్రాయం సరైనది కాదు. ఇది చాలా సున్నితమైన విషయం. దీని వల్ల ఫీమేల్ ఆర్టిస్టులను చులకన భావంతో చూడటం చాలా వరకు తగ్గిందని ప్రియమణి తన అభిప్రాయాన్ని వ్యక్త పరచారు. చాలా కాలం తర్వాత ప్రియమణి ఇలాంటి విషయాల మీద స్పందించడం మిగతా హీరోయిన్స్ కి ఆనందాన్ని కలిగిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: