తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ చివరకు వచ్చేసింది.. మొదటి రెండు సీజన్లు ఆకట్టుకున్నంతగా మూడో సీజన్ రాణించలేక పోయింది అనే మాటలు మూట కట్టుకుంది . మరి ఉన్న సెలెబ్రెటీలు ఎదో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు అనుకుంటే వారి తీరు కూడా గందరగోళంగా మారింది.. నువ్వా నేనా అని లేకపోతే కక్షలు పెంచుకొని ఒకరి మీద మరొకరు దూషించుకుంటున్నారు. 


ఇకపోతే గత సీజన్లో కౌషల్ బాగా గేమ్ అడుతున్నాడు అని అతనికి ఊరు వాడా అని లేకుండా కౌశల్ ఆర్మీ పేరుతో రచ్చకు దారి తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ సీజన్లో కూడా అలాంటిది జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. కూల్ గా ఉంటూనే వెనకాల గోతులు తవ్వుతున్నారు. అలా ఎలానో ఇంత దూరం వచ్చేసింది. 


శ్రీముఖి విషయానికొస్తే మనిషి ఎంత పెద్దగా ఉంటుందో నోరు కూడా అంతకు మించి ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా పెద్ద గా అరిచి చెప్పడం ఆమె నైజం.. ఆలీ , శివజ్యోతి , మహేష్ లు ఇంకా ఈ బ్యూటీ లు బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ ఆడేటప్పుడు ఏంతో చాకచక్యంగా ఆడుతున్నారు ఎందుకంటే చాలా సార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన కూడా బయట పడుతూ వస్తున్నారు. 


దానితో శ్రీముఖి కూడా నేను గేమ్ ఆడటానికి బిగ్ బాస్ కి వచ్చాను అని అణా సందర్భాలు లేకపోలేదు..శ్రీముఖి ప్రవర్తన మాట తీరు చూస్తుంటే అందరికి కోశల్ గుర్తుకు వస్తున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. కౌషల్ కూడా పదే పదే నేను గేమ్ ఆడటానికి వచ్చాను అని అంటుండేవాడు. ఇప్పుడు శ్రీముఖి కూడా అదే అంటుంది. టైటిల్ విన్నర్ కౌషల్ అయినట్లు శ్రీముఖి కూడా అవుతుందని అనుకుంటున్నారు...మరి ఎవరు అవుతారో చూడాలి...


మరింత సమాచారం తెలుసుకోండి: