తెలుగులో అందరు అగ్ర హీరోలతో అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన సుప్రసిద్ధ కథానాయకి పద్మశ్రీ శోభనస్వతహాగా మలయాళీ అయిన శోభన తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది, మరిన్ని స్టేజ్ షోస్ చేసింది. విక్రమ్ సినిమా  ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది శోభన. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌తో, మోహన్ బాబుతో మొదలైనవారితో నటించింది.

తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాళులో అద్భుతంగా నటించి అవార్డు పొందారు. 2006లో చివరగా మోహన్ బాబు విష్ణు కలిసి నటించిన గేమ్ సినిమాలో కనిపించింది. 13 ఏళ్లు గడిచినా మళ్లీ తెలుగు సినిమాల వైపు చూడని శోభన, అప్పుడప్పుడూ తమిళ మలయాళ సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది.

ఈ మధ్యకాలంలో ‘జాదూజ్’ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న పద్మశ్రీ శోభన.. తెలంగాణ ప్రభుత్వ ‘టి.ఫైబర్’తో కలిసి రంగారెడ్డి జిల్లాలోని తూములూరు గ్రామంలో జాదూజ్ ఏర్పాటు చేస్తున్న “జాదూజ్ సెంటర్” పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు.  14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జంటగా నటిస్తున్నారు మలయాళ నటుడు సురేశ్‌ గోపీ, శోభన. ‘మణిచిత్రతాళే, ఇన్నలే, కమీషనర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాల్లో కలసి నటించారు శోభన, సురేష్‌ గోపీ.

2005లో ‘మక్కళుక్కు’ అనే సినిమాలో చివరిసారి కలసి నటించారు. లేటెస్ట్‌గా అనూప్‌ సత్యన్‌ దర్శకత్వంలో ఈ జంట నటిస్తోంది. తొలిరోజు షూటింగ్‌లో తీసిన ఫొటో ఇది. ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్, కల్యాణీ ప్రియదర్శన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. శోభన, సురేష్ గోపి కలిసి కనిపించి అభిమానులని సంతోష పెట్టారు. 2020లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వస్తోంది.     



మరింత సమాచారం తెలుసుకోండి: