అంతకుముందు రెండు సినిమాలు చేసినా నిధి అగర్వాల్ కు ఇస్మార్ట్ శంకర్ తోనే సూపర్ హిట్ వచ్చింది. ఏ హీరోయిన్ ను ఎలా వాడుకోవాలో దర్శకుడు పూరి జగన్నాథ్ కు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఇస్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్ తో పాటుగా నభా నటేష్ ను ఫుల్లుగా వాడేశాడు. ఇద్దరి హీరోయిన్స్ కు ఆ సినిమా ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది.


ఆ సినిమా తర్వాత ఇద్దరు వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ సాయి తేజ్ సినిమాలో ఛాన్స్ పట్టేసినట్టు తెలుస్తుందు. అంతకుముందు రెండు సినిమాలు అక్కినేని హీరోలతో చేసినా వర్కవుట్ కాలేదు. రాం తో ఇస్మార్ట్ శంకర్ హిట్ పడేసరికి అమ్మడికి లక్ కలిసి వస్తుంది. ఇదిలాఉంటే ఈమధ్య క్రికెటర్ తో ప్రేమలో పడ్డదంటూ వార్తల్లో నిలిచిన నిధి అగర్వాల్ తన ట్విట్టర్ స్టేటస్ తో అందరికి షాక్ ఇచ్చింది.


ఎంగేజెడ్ అంటూ స్టేటస్ పెట్టిన నిధి నిజంగానే ఎవరితో అయినా ఎంగేజ్మెంట్ జరుపుకుందేమో అనుకున్నారు. అయితే అలా ఎందుకు పెట్టిందో ఏమో కాని ప్రస్తుతం అలాంటిది ఏమి లేదని ఒకవేళ తన లైఫ్ లో అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ముందు మీకే చెబుతా అంటూ ఫ్యాన్స్ తో అంటుంది. ఒకవేళ అమ్మడు లవ్ కన్ ఫాం అయ్యింది కాబట్టి ఎంగేజెడ్ అని పెట్టి ఉండొచ్చని అంటున్నారు. 


ఏది ఏమైనా తెలుగులో ఇస్మార్ట్ హిట్ తో పాపులారిటీ తెచ్చుకున్న నిధి అగర్వాల్ మరో రెండు హిట్లు పడితే స్టార్ హీరోయిన్ అయినట్టే. ప్రస్తుతం సాయి తేజ్ సినిమాలో మాత్రమే నటిస్తున్న నిధి మరో రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ లో నటించిన నభా నటేష్ కూడా వరుసగా ఛాన్సులు అందుకుంటుంది. ఇస్మార్ట్ హిట్ ఈ ఇద్దరి హీరోయిన్ల కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: