ఆరడుగుల అందగాడు... ఆరుపలకల వీరుడు ... మొత్తంగా అమ్మాయిల కలల రాకుమారుడు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. టాలీవుడ్ లో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకూ టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్  బాహుబలి సినిమా  ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించడంతో ప్రపంచం నలుమూలలా  ప్రభాస్ క్రేజ్ పాకిపోయింది. ఆ తర్వాత వచ్చిన సాహో  సినిమాతో కూడా ఆ క్రేజ్  ఇంకాస్త పెరిగింది. ప్రభాస్ పుట్టిన రోజు వచ్చిందంటే  ప్రభాస్ పుట్టిన రోజుని అభిమానులు ఎలా జరుపుతారో  తెలిసిందే. కటౌట్ కి పాలాభిషేకాలు  బ్యాండ్  బాజాలతో ఎంజాయ్ చేస్తూ ప్రభాస్ బర్త్ డే  జరుపుకుంటారు.  

 

 

 

 

 అయితే గత నాలుగేళ్లుగా వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపారు ప్రభాస్. బాహుబలి ఆ తర్వాత సాహో ఇలా కొంచెం కూడా విశ్రాంతి లేకుండా గడిపిన ప్రభాస్ తన బర్త్ డే వేడుకలు కూడా సినిమా సెట్స్ లోనే  జరుపు lకున్నాడు. కాగా ఈ నెల 23న ప్రభాస్ 40వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు . దీంతో అభిమానులు కూడా ప్రభాస్ బర్త్ డే గ్రాండ్ గా  సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ నెల 19న లండన్ లోని  రాయల్ ఆల్బర్ట్ హాల్ లో  బాహుబలి సినిమా ను ప్రదర్శించనున్నారు. అయితే ఇక్కడ విశేషమేమిటంటే ఈ హాల్లో ప్రదర్శించబడుతున్న తొలి నాన్  ఇంగ్లీష్ సినిమాగా బాహుబలి రికార్డులకెక్కింది. తెలుగు వర్షన్ సబ్ టైటిల్స్ తో  ఈ సినిమాని ప్రదర్శించనుండగా ... ఈ ప్రదర్శన కి ప్రభాస్ కూడా హాజరుకానున్నారు. 

 

 

 

 

 అయితే ఈ వేడుకల తర్వాత ప్రభాస్... తన పుట్టిన రోజు వేడుకలను లండన్ లోనే గ్రాండ్ గా  సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల సమాచారం. ఇక ఇప్పటికే ప్రభాస్ బర్త్ డే  కి సంబంధించి లండన్ లో  ఏర్పాట్లు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. అయితే గత నాలుగేళ్ల నుంచి సినిమా సెట్స్ పైనే తన  బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్న ప్రభాస్... ఈసారి సినిమాల నుండి కాస్త ఫ్రీ అవడంతో తన బర్త్ డే ను  గ్రాండ్ గా  జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు  సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: