జనవరి 2020 పోటీ ఫుల్ గా ఉండే విధంగా కనిపిస్తోంది.  జనవరిలో పెద్ద సినిమాలు ఉండటంతో చాలా చిన్న సినిమాలు పోటీ నుంచి తప్పుకున్నాయి.  అయితే, మొన్నటి వరకు జనవరికి వస్తుంది అనుకున్న బాలకృష్ణ 105 వ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నది.  సంక్రాంతి నుంచి తప్పుకున్న ఈ సినిమా ఈఏడాది డిసెంబర్ 20 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  


ఇదిలా ఉంటె, జనవరి 12 వ తేదీన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలు రిలీజ్ కాబోతున్నది.  ఈ రెండు పెద్ద సినిమాలో భారీ అంచనాలు ఉన్న సినిమాలే.  మొదటిసారి మహేష్, అల్లు అర్జున్ సినిమాలు  రెండు ఒకేరోజు రిలీజ్ కాబోతున్నాయి.  రెండు సినిమాలు డేట్స్ ను ఈరోజు ప్రకటించారు.  రెండు ఒకేరోజు రిలీజ్ కావడం వలన పోటీ ఉన్నప్పటికీ దానికి మించిన ఇబ్బందులు కూడా కొన్ని ఉండే ఉంటాయి.  


రెండు సినిమాలు వినోదానికి పెద్దపీఠ వేస్తున్న సినిమాలే కావడం విశేషం.  రెండు సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  రెండింటి బడ్జెట్ కూడా అధికంగా ఉందని చెప్పాలి.  అయితే, ఈ రెండు సినిమాలతో పాటుగా మరో సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.  అదే వెంకీమామ.  వెంకిమామ సినిమా జనవరి 14 న రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం అందుతోంది.  దీనికి సంబంధించిన ప్రకటనను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. 


ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్ హీరోగా చేసిన ఎఫ్ 2 సినిమా రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా మంచి విజయం సాధించింది. అనిల్ రావిపూడి దర్శకుడు.  అయితే, అదే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా రిలీజ్ కాబోతున్నది.  దర్శకుడు, హీరోల సినిమాలు రెండు రెండు  రిలీజ్ కాబోతున్నాయి. వెంకిమామ సినిమాలో వెంకటేష్, నాగచైతన్య హీరోలు.  కామెడీ ప్రధానంగా తెరకెక్కుతోంది.  బాబీ దర్శకుడు.  ఈ మూడు సినిమాతో పాటు రజినీకాంత్ దర్బార్ సినిమా కూడా సంక్రాంతికి రాబోతున్నది.  మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: