ఇటీవల తెలుగు తెరపై ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్ వన్ మంచి రేటింగ్స్ మరియు క్రేజ్ తో సాగిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తెరకెక్కిన ఫస్ట్ సీజన్ పై మొదట్లో కొన్ని అపోహలు వచ్చిప్పటికీ, మెల్లగా రోజురోజుకు అవన్నీ తొలగిపోవడం, అలానే ప్రేక్షకులు కూడా షో కి కనెక్ట్ అవుతూ వచ్చి షో మంచి సక్సెస్ సాధించింది. ఇక ఆ తరువాత ప్రసారం అయిన సెకండ్ సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించి, షోని మరింత ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇక ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా ప్రసారం అవుతున్న మూడవ సీజన్, మొన్నామధ్య కాస్త చప్పగా ముందుకు సాగినప్పటికీ, ఇటీవల మళ్ళి పుంజుకుని, 

ప్రస్తుతం అద్బుతమైన క్రేజ్ మరియు రేటింగ్స్ తో ముందుకు సాగుతోంది. ఇక ప్రతి వారం మాదిరిగా ఈ వారం కూడా ఎలిమినేషన్ జోన్ లో రాహుల్, వరుణ్ సందేశ్, మహేష్ విట్టా మరియు వితికలు నిలవగా, వారిలో వితక మెడాలియన్ వలన సేఫ్ అవడం, ఇక నిన్న రాత్రి మిగతా ముగ్గురూ కూడా ఎలిమినేషన్ జోన్ లో నిలవడం జరిగింది. నేడు జరుగబోయే ఈ వారం ఎలిమినేషన్లో బయటకు వెళ్ళేది మహేష్ విట్టానే అంటూ నిన్నటినుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే కేవలం ఈ వారం మాత్రమే కాక, ప్రతి వారం కూడా ఈ విధంగానే ఎలిమినేట్ కాబోయే హౌస్ మేట్ విషయమై ముందస్తు వార్తలు బయటకు వస్తుండడంతో, 

అందరూ కూడా అలానే భావించి, ఈ వారం మహేష్ విట్టా బయటకు వెళ్ళడం ఖాయం అని అనుకుంటున్నారు. అయితే రేపు ఎలిమినేట్ కాబోయేది అతడు కాదు అంటూ షాకింగ్ గా మరొక వార్త ప్రచారం అవుతోంది. దానిని బట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళేది మహేష్ కాదు, రాహుల్ అని అంటున్నారు. ఓటింగ్స్ పరంగా చూసుకుంటే, చిట్ట చివరి నిమిషంలో రాహుల్ కు మహేష్ కంటే ఒకింత తక్కువ శాతం ఓట్లు వచ్చాయని, సో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళేది రాహుల్ అని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం నేటి రాత్రి వరకు ఓపికపట్టాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: