మెగా బ్రదర్ నాగబాబు మొత్తం లుక్ ని చేంజ్ చేసారు. కొత్త లుక్ లో దర్శనం ఇచ్చారు. అయన కొత్త లుక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తం యంగ్ లుక్ టిషర్ట్ తో నాగబాబు కనిపిస్తున్నారు. అయితే నాగబాబు ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అందుకే అయన ఈ లుక్ లో కనిపిస్తున్నారని తెలుస్తుంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ లుక్ లో అయన చాలా స్లిమ్ గా చాలా స్టైల్ గా కనిపిస్తున్నారు.


నాగబాబు ప్రస్తుతం జబర్దస్త్ జడ్జ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం నాగబాబు అయన తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. దానికి తోడు చిరంజీవి సైరా కూడా హిట్టు అవడంతో అయన మరింత జోష్ లో ఉన్నారు. ఇక నాగబాబు కనిపించే ఈ లుక్‌లో చూసిన ప్రతివారు షాక్ అవుతున్నారు. ఈనాటి కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న ఈ సరికొత్త స్టైలీష్ లుక్కుకు ఫిదా అవ్వుతున్నారు.


ఇక మరో విషయమేంటంటే ఈయన తనయుడు వరుణ్ తేజ్ ఒకే విధమైన సినిమాలు కాకుండా.. తన ఒక్కో సినిమాలో కొత్త యాంగిల్‌ ఉండేలా.. సినిమాలు చేసుకుంటూ.. వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇక ప్రస్తుతం మెగా హీరోల్లో అందరికంటే.. ఫాస్ట్‌గా.. ప్రేక్షకులకు దగ్గరయ్యింది వరుణ్‌ అనే చెప్పాలి. తొలిప్రేమ, ఎఫ్‌ 2, తాజగా గద్దలకొండ గణేష్‌ సినిమాలతో.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తన నటనతో విజృంభించాడనే చెప్పాలి. దీంతో..


ఎటు చూసినా.. గద్దలకొండ గణేష్ టాక్‌నే వినిపిస్తుంది.. ఒక్కసారిగా.. వరుణ్‌కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఆఫర్లన్నీ క్యూ కట్టాయి. సినిమా ప్రాజెక్టులకు వరుసగా సంతకాలు చేసేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆసక్తిరమైన విషయం ఏంటంటే.. బ్లాక్‌ బస్లర్ హిట్‌ తర్వాత.. మెగాప్రిన్స్ తన రెమ్యునరేషన్‌ని పెంచేశాడట. ఇకపోతే వరుస విజయాలతో దూసుకెళ్తున్న వరుణ్ విషయంలో, నాగబాబు కళ్లల్లో పుత్రోత్సాహం కనిపిస్తుందట.   

మరింత సమాచారం తెలుసుకోండి: