ఈ మధ్య కాలంలో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకు సరైన హిట్ లు పడటం లేదు. నాని, శర్వానంద్ ల మాదిరిగానే వెనకబడిపోతున్నాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్ విజయ్ కి భారీ ఫ్లాప్ గా మిగిలింది. అయినా హీరోయిన్లలో విజయ్ కి ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కి విజయ్ దేవరకొండతో నటించాలనుకుంటున్నట్టుగా ప్రకటించుకుంది. అలా యంగ్ హీరోయిన్ కు డ్రీమ్ హీరోగా మన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నిలిచాడు. ఇక మరో సీనియర్ హీరోయిన్ కూడా ఇప్పుడు విజయ్ మీద ఎంతో క్రేజ్ గా ఉంది.

ఆ హీరోయిన్ ఎవరు..అని తెలిస్తే నిజంగా షాక్ లో ఉంటారు. ఎందుకంటే విజయ్ మీద అంతగా క్రేజ్ పెంచుకుంది రకుల్ ప్రీత్ సింగ్ కాబట్టి. విజయ్ దేవరకొండతో నటించాలని ఉందంటోంది రకుల్ ప్రీత్. ప్రస్తుతం ఈ హీరోయిన్ కెరీర్ అటు ఇటు గా ఉన్న సంగతి తెలిసిందే. చాలా కాలం నుండి రకుల్ కి తెలుగులో సరైన హిట్స్ లేవు. మన్మధుడు -2 ఫెయిల్యూర్ తో రకుల్ కెరీర్ ఇంకా స్లో అయ్యింది. అయినా కూడా తను ఫెయిల్యూర్స్ లో ఉన్నట్టుగా రకుల్ ఒప్పుకోవడం లేదు.

కెరీర్ ప్రారంభించిన తక్కువ టైం లోనే తను స్టార్ హీరోయిన్ అయినట్టుగా రకుల్ చెబుతోంది. తనకు అవకాశాలు ఏమీ పూర్తిగా రాకుండా పోలేదని, ఇప్పుడు కూడా చేతిలో సినిమాలున్నాయని గొప్పలు పోతోంది. తన కెరీర్ బాగానే సాగుతున్నట్టుగా డబ్బా కొట్టుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో విజయ్ దేవరకొండతో నటించాలని ఉందంటూ రకుల్ ప్రీత్ సింగ్ తన డ్రీమ్ హీరో గురించి ఇన్‌డైరెక్ట్ గా చెప్పింది. మరి రకుల్ కు తన సినిమాల్లో విజయ్ ఏమైనా అవకాశం ఇప్పిస్తాడేమో చూడాలి! ఎందుకంటే పాపం రకుల్ ఇప్పటి వరకు ఎవరిని అడగనప్పటికి విజయ్ ని మాత్రం ఫస్ట్ టైం నోరు తెరిచి అడిగింది.  మరి అర్జున్ రెడ్డి లాంటి సినిమా ఇస్తే చేస్తుందా..లేక గీత గోవిందం లాంటి సినిమా అంటే ఒప్పుకుంటుందో మాత్రం రకుల్ చెప్పలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: