సంక్రాంతికి సినిమాలు రెడీ అవుతున్నాయి.  ఎప్పడూ లేనంతగా ఈసారి సంక్రాంతికి కోసం పెద్ద ఎత్తున పోటీ జరగబోతున్నది.  జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే పోటీ జనవరి 15 వ తేదీ వరకు కొనసాగబోతున్నది.  జనవరి 10 న సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ సినిమా రాబోతున్నది.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఇందులో రజినీకాంత్ పోలీస్ పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ రిలీజైన రెండు రోజులకు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ కాబోతున్నది.  


మహేష్ బాబు పక్కా ఎంటర్టైనర్ గా వస్తుంటే.. అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫస్ట్ టైం మహేష్, అల్లు అర్జున్ సినిమాలు సంక్రాంతికి పోటీ పడుతున్నాయి.  రెండు సినిమాలపై అంచనాలు కూడా తారా స్థాయిలో ఉన్నాయి.  ఈ రెండింటి తరువాత జనవరి 14 వ తేదీన వెంకటేష్, నాగ చైతన్యల వెంకిమామ రిలీజ్ కాబోతున్నది.  


ఈ మూవీ కూడా పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.  వెంకటేష్ ఎంటర్టైనర్, చైతన్య యాక్షన్ తో సినిమా టాప్ రేంజ్ లో ఉండబోతున్నది.  సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.  ఎన్టీఆర్ జైలవకుశ సినిమా తరువాత వెంకటేష్, నాగచైతన్యతో సినిమా చేస్తున్నాడు బాబీ.  సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో సినిమా తెరకెక్కుతోంది.  ఇక ఇదిలా ఉంటె, ఈ మూవీ రిలీజైన మరుసటి రోజు అంటే జనవరి 15 వ తేదీన నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమా వస్తున్నది.  


వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమా ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి టాక్ వచ్చింది. ఇందులో మెహ్రీన్ హీరోయిన్. దీనికి ముందు నాలుగు పెద్ద సినిమాలు రాబోతున్నాయి.  ఈ నాలుగు పెద్ద సినిమాలను తట్టుకొని ఈ సినిమా ఏ మేరకు నిలబడగలుగుతుందో చూడాలి.  చూస్తుంటే నాలుగు సినిమాలు హిట్టయ్యేలానే ఉన్నాయి.  మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే జనవరి 15 వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: