డీజే బ్యూటీ పూజా హెగ్డే స్పీడ్ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదనిపిస్తుంది?.. అందం .. ట్యాలెంటుతో పాటు లక్ కూడా బాగా కలిసొస్తే ఎలా ఉంటుందో పూజా ని ఎగ్జాంపుల్ గా చూపించొచ్చు. టాలీవుడ్ ని వదిలేసి వెళ్ళినా కూడా మళ్ళీ మనవాళ్ళు పూజాని అక్కున చేర్చుకున్నారు. దాంతో డీజే- మహర్షి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది. ప్రస్తుతం వరుసగా భారీ సినిమాల్లో నటిస్తోంది. ప్రభాస్ సరసన జాన్.. బన్ని సరసన 'అల వైకుంఠపురంలో' సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజి బిజీగా ఉంది. అంతేకాదు ఇటీవల గద్దలకొండ గణేష్ లో శ్రీదేవిగా మెప్పించిన పూజా సూపర్ స్టార్ మహేష్ సినిమా సరిలేరు నీకెవ్వరు లోను ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బన్ని-త్రివిక్రమ్ తో కలిసి ఆన్ సెట్స్ లో బిజీబిజీగా గడిపేస్తోంది పూజా.

ఇక అక్టోబర్ 13 న పూజా బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుపుకుంది. ఈ ఏడాది పూజా తన 29వ బర్త్ డే సెట్స్ లోనే జరుపుకుంది. అది కూడా ఓ తెలుగు సినిమా సెట్ లో. అల్లు అర్జున్- త్రివిక్రమ్ సహా అల వైకుంఠపురంలో చిత్రయూనిట్ సమక్షంలోనే పూజా కు బర్త్ డే సెలబ్రేషన్ అదిరిపోయే రేంజులో ప్లాన్ చేశారు. ఇక ఆన్ సెట్స్ బర్త్ డే ట్రీట్ అంటే 'అల' బర్త్ డే అని చెప్పాలి. ఇక అరవింద సమేత మాదిరిగా అల కూడా సూపర్ హిట్టయితే పూజా అకౌంట్ లో మరో సక్సస్ పడినట్టే అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమా హిట్ అయితే పూజా రేంజ్ ఇంకా పెరగడం ఖాయం.

టైటిల్లోనే నాయిక పేరును హైలైట్ చేశారు త్రివిక్రమ్ మరోసారి. అరవింద సమేతలో అరవిందగా నటించిన పూజాకు ఈసారి అల అనే పాత్రను డిజైన్ చేశారు. అయితే ఈసారి కంపెనీ సీఈవో గా అల పాత్ర ఉండబోతోంది. సాఫ్ట్ వేర్ కంపెనీ యజమానిగా నటిస్తోందట పూజా. ఇదివరకూ సామజవరగమన పాటను రిలీజ్ చేసినప్పుడు అందులో పూజా లుక్ రివీలైంది. అంతకుమించి సీఈవో రేంజ్ అంటే ఎలా ఉంటుందో తెరపై చూపిస్తారట మాటల మాంత్రీకుడు. మరోవైపు బాలీవుడ్ లో పూజా హెగ్డే నటించిన భారీ మల్టీస్టారర్ హౌస్ ఫుల్ 4 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఆ చిత్రయూనిట్ పూజాకి బర్త్ డే విషెస్ సర్‌ప్రైజ్ గా ఇచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: