మెగా పవర్ స్టార్ రాం చరణ్ మొదటి సినిమా చిరుతలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ గుర్తుంది కదా. ఎందుకు గుర్తుండదు ఆ సినిమాతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నా ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు లేక కెరియర్ అటకెక్కేసిందిగా అనుకోవచ్చు. బాలీవుడ్ సినిమాలకే పరిమితమైన ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.


రెండు మూడు రోజులకు ఒకసారి హాట్ ఫోటో షూట్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుది నేహా శర్మ. అమ్మడి హాట్ షో సినిమా ఛాన్సుల కోసమే అని తెలుస్తున్నా మంచి ఫాంలో ఉన్నప్పుడు చేయాల్సిన గ్లామర్ షో అంతా కెరియర్ దాదాపు ముగిసింది అనుకున్న టైం లో చేస్తుంది. అయితే ఇప్పుడు ఇంత చేసినా సరే అమ్మడి కష్టాన్ని గుర్తుంచే దర్శక నిర్మాతలు లేరని చెప్పాలి.   


లేటెస్ట్ గా రెడ్ స్లీవ్ లెస్ టాప్ తో.. ఓర చూపులతో మతి పోగొట్టేలా చేస్తుంది నేహా శర్మ. పర్ఫెక్ట్ ఫిగర్ కు ఉండాల్సిన ఫిట్ నెస్ ను ఇప్పటికి మెయింటైన్ చేస్తున్న ఈ చిరుత భామ సరైన ఛాన్స్ రావాలే కాని రెచ్చిపోవడం ఖాయం అనేట్టుగా హింట్లు ఇస్తుంది. సినిమాలు చేయకున్నా హాట్ ఫోటో షూట్స్ తో ఫాలోయింగ్ పెంచుకున్న నేహా శర్మ రీసెంట్ గా ఓ పంజాబి సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.  


తెలుగులో రాం చరణ్ సరసన నటించిన ఈ అమ్మడు వరుణ్ సందేష్ కుర్రాడు సినిమాలో కూడా నటించి మెప్పించింది. మరి మరోసారి తెలుగులోనే ట్రై చేస్తే ఒకవేళ ఏదైనా అవకాశాలు వచ్చే పరిస్థితి ఉండొచ్చు. సినిమాలు చేసినా చేయకున్నా ఆమె ఫ్యాన్స్ కు మాత్రం హాట్ స్పెషల్ ట్రీట్ ఇస్తుంది నేహా శర్మ. ఈ క్రమంలో వచ్చిన లేటెస్ట్ పిక్స్ కూడా క్రేజీగా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: