మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సైరా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లతో స్టడీగా దూసుకెళ్తోంది. సినిమా విడుదలై పది రోజుల్లో భారీ కలెక్షన్లు రాబట్టి కేవలం తెలుగులోనే 100 కోట్ల షేర్ కు అతి దగ్గరలో ఉంది. దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలంతో సాధించిన తెలుగు రాష్ట్రాల షేర్ 94 కోట్లను దాటి నాన్ బాహుబలి రికార్డును సృష్టించబోతోంది.

 


నైజాంలో ఈ సినామాను విడుదల చేసిన దిల్ రాజు 29 కోట్ల భారీ మొత్తానికి సైరాను తీసుకున్నాడు. నైజాంలో చిరంజీవికి తిరుగులేదని సైరా మరోసారి నిరూపించింది. ఇప్పటికే ఈ మొత్తాన్ని రాబట్టేసింది. ఇప్పటికీ స్టడీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న సైరా ఇకపై రన్ అయిన రోజుల్లో వచ్చేదంతా లాభమే. దీంతో దిల్ రాజు సేఫ్ జోన్ దాటి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరయ్యాడు. ఇప్పట్లో సైరాకు పోటీ కూడా లేదు. త్వరలో మరే సినిమా రిలీజ్ లేకపోవడం కూడా బాగా కలిసొచ్చింది. దీంతో ఈ సినిమా ఫుల్ రన్ లో 40 కోట్ల వరకూ కలెక్షన్లు రాబట్టొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిరంజీవికి నైజాంలో స్ట్రాంగ్ మార్కెట్ ఉంది. వైజాగ్ ఏరియాలో కూడా సైరా సేఫ్ జోన్ దాటిందని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి.

 


1992లో వచ్చిన ఘరానామొగుడు సినిమాను అప్పట్లోనే హైదరాబాద్ లో 100 ధియేటర్లలో రిలీజ్ చేశారు. 2002లో ఇంద్ర సృష్టించిన రికార్డులు తిరగరాయడానికి మరో సినిమాకు చాలా ఏళ్లు పట్టింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా కోటి రూపాయలు వసూలు చేసిన చిరంజీవి సినిమాలు 5 వరకూ ఉన్నాయి. చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఖైదీ నెం.150, సైరా కలెక్షన్లు రుజువు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: