తెలుగు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. రాజకీయాల నుంచి తిరిగి సినిమాల్లోకి వచ్చి.. చేసిన రెండు సినిమాలతో టాలీవుడ్ లో తన క్రేజ్, స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. చిరంజీవి సృష్టించిన రికార్డులను ఆయన కుటుంబం నుంచి వచ్చిన వారే బద్దలుకొట్టడం మళ్లీ ఆ రికార్డులను చిరంజీవే తిరగరాయడం రెండు దశాబ్దాలుగా జరుగుతోంది. ఇటువంటి అరుదైన ఘటన భారతదేశంలోని మరే సినీ ఇండస్ట్రీలో కూడా జరగే అవకాశం లేదు.

 


పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చాక 2001లో ఖుషి ఇండస్ట్రీ హిట్ తో కొత్త రికార్డులను సెట్ చేశాడు. తర్వాత ఏడాదే ఆ రికార్డులను ఇంద్రతో చెరిపేసిన చిరంజీవి కొత్త రికార్డులు సృష్టించాడు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాక 2009లో మగధీరతో తిరుగులేని రికార్డులు క్రియేట్ చేశాడు. ఆ రికార్డులను 2013లో పవన్ కల్యాణ్ తన అత్తారింటికి దారేదితో బ్రేక్ చేశాడు. 2017లో చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెం.150తో నాన్ బాహుబలి పేరుతో కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. తర్వాత ఏడాది తనయుడు రామ్ చరణ్ రంగస్థలంతో తండ్రి రికార్డులను చెరిపేసి 217 కోట్ల కలెక్షన్లతో ఓ బెంచ్ మార్క్ ను సెట్ చేశాడు. ఈ ఏడాది చిరంజీవి సైరాతో వచ్చి రంగస్థలంకు చెక్ పెట్టనున్నాడు.

 


దీంతో.. తెలుగు సినిమాల్లో మెగా హీరోల హవా ఎలాంటిదో మరోసారి స్పష్టమవుతోంది. అన్న రికార్డులను తమ్ముడు, తమ్ముడు రికార్డులను అన్న, కొడుకు రికార్డులను బాబాయ్, తండ్రి రికార్డులను కొడుకు, కొడుకు రికార్డులను తండ్రి దాటేస్తూ ఒకే కుటుంబ హీరోలే పోటీపడడం యాధృచ్చికమే అయినా ఇదొక ఘనతగానే చెప్పుకోవాలి. ఇటువంటి ఘనతకు కారణం మెగాస్టార్ చిరంజీవి సంపాదించిన అశేష అభిమానగణం, ప్రేక్షకులే కారణమని చెప్పుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: