బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి తెలియని వారు ఉండరు.  ఎంత స్టార్ హీరో రేంజ్ ఉన్నా అదే స్థాయిలో వివాదాలు కూడా ఆయన చుట్టూ ఉంటాయి.  గతంలో కృష్ణ జింక కేసు, హిట్ అండ్ రన్ కేసు విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  ఒకనొక సమయంలో జైలుకు కూడా వెళ్లి వచ్చారు.  అయితే సల్మాన్ ఖాన్ హీరోయిన్ల విషయంలో కూడా రూఢ్ గా వ్యవహరిస్తారని ఆరోపణలు ఉన్నాయి.  బాలీవుడ్ లో బిగ్ బాస్ కి ఆయన హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పన్నెండు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు.  ప్రస్తుతం బిగ్ బాస్ 13 సీజన్ నడుస్తుంది.

అయితే ఇది మొదలైనప్పటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన ఈ రియాల్టీ షోపై విమర్శలు కూడా అదే స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. షోలోని కంటెస్టెంట్ ల మధ్య అసభ్య, అభ్యంతరకర, ఆశ్లీల సన్నివేశాలు ఎక్కువగా ఉంటున్నాయని... కుటుంబసభ్యులు కలిసి చూసేలా షో లేదని పలువురు మండిపడుతున్నారు.  గతంలో బిగ్ బాస్ లో లేని విధంగా అశ్లీలంతో ఎంట్రటైన్ చేస్తున్నారని..కేవలం రేటింగ్ కోసం ఇలాంటి వ్యవహారాన్ని నడిపించడం పై సీరియస్ అవుతున్నారు.  ఈ షోపై నిషేధం విధించాలని పలువురు రాజకీయ నాయకులు కూడా డిమాండ్ చేశారు. పలు చోట్ల ఈ షోకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి.   

ఈ నేపథ్యంలోనే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సల్మాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత సంస్కృతిని దెబ్బతీసేలా బిగ్ బాస్ ఉందంటూ సల్మాన్ నివాసం ఎదుట శుక్రవారంనాడు కర్ణిసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: