టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ... ఎంతోమంది హీరోల సరసన మెరిసింది . హీరోల సరసన గ్లామర్ పాత్రల్లో మెరిసి యూత్ ను  ఆకర్షించింది ఈ అమ్మడు. అయితే యంగ్ హీరోల సరసన నటంచినప్పటికీ ఈ అమ్మడికి మాత్రం సరైన అవకాశాలు రాలేదు. దీంతో రోజురోజుకీ టాలీవుడ్ లో కొత్త కొత్త హీరోయిన్స్ వస్తుండడంతో... తాప్సికి కాస్త అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. అయితే బాలీవుడ్ లో కూడా మొదట్లో అంతగా కలిసి రానట్టు కనిపించినప్పటికీ... ఆ తర్వాత మాత్రం తన సినిమాలు మంచి విజయాన్ని సాధించి మంచి క్రేజ్ సంపాదించింది . 

 

 

 

 

 

 దీంతో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ  దూసుకుపోతుంది ఈ అమ్మడు . నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేస్తూ తన నటనతో అందరినీ మెప్పిస్తుంది. ఇప్పటికే పలు వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించింది తాప్సీ. ఇక ఇప్పుడు ప్రేక్షకుల్లో తాప్సి ఏ పాత్రలోనైనా నటిస్తుంది అంటే ఆ పాత్రలో ఏదో ప్రత్యేకత ఉందని భావించే స్థాయికి చేరుకుంది. ఇక ఈ అమ్మడు  చేసిన సినిమాలు కూడా మంచి విజయం సాధిస్తుండడంతో... ఈ భామకి వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. దీంతో వరుస సినిమాలతో  బిజీబిజీగా గడుపుతోంది తాప్సి . అయితే తాజాగా ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సి కొన్ని ఆశక్తికర విషయాలను తెలిపింది. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ఇతరులను బ్రతిమిలాడే దాన్నని ... ఇతరులు దయతలిస్తే కానీ ఒకప్పుడు సినిమా అవకాశాలు వచ్చేవి కావు అని తెలిపిన తాప్సి... ఇప్పుడు మాత్రం సినిమాలే  తనను వెతుక్కుంటూ వచ్చే స్థాయికి ఎదిగానని చెప్పింది. 

 

 

 

 

 

 అంతే కాకుండా తన రెమ్యూనరేషన్ కి సంబంధించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తాప్సీ. గత రెండేళ్లలో తన రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందని తెలిపిన ఈ అమ్మడు... తనతో నటిస్తున్న నటులతో  పోలిస్తే మాత్రం తన రెమ్యూనరేషన్ తక్కువే అని చెప్పింది. అయితే ఒకేసారి ఎక్కువగా సంపాదించాలనే కోరిక కూడా తనకు లేదని తెలిపింది. అంతే కాకుండా ఒక్కసారిగా భారీ గా రెమ్యూనరేషన్ పెంచేసి... తన సినిమాలను ఇబ్బందుల్లోకి నెట్టడం  తనకు ఇష్టం తెలిపింది. ప్రస్తుతం తను తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తో తాను సంతృప్తి గా ఉండడంతో పాటు... నిర్మాతలు కూడా సంతోషంగానే ఉన్నానని చెప్పింది ఈ అమ్మడు .

మరింత సమాచారం తెలుసుకోండి: