స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రభావితం చేస్తున్న ఆ నలుగురిలో ఒకరు అన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఒకప్పుడు సక్సస్ కు కేరాఫ్ అడ్రెస్ గా కొనసాగిన దిల్ రాజ్ నిర్మాతగా మాత్రమే కాకుండా పంపిణీదారుడిగా కూడా  రాణిస్తూ ఆయన టేకప్ చేసిన సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. 

దిల్ రాజ్  నైజాం ఏరియా రైట్స్ తీసుకున్నారంటే మిగతా ఏరియాల్లోని బయ్యర్లు ఆసినిమా రైట్స్ కళ్ళు మూసుకుని నిర్మాత చెప్పిన ధరకు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే  ఈమధ్య కాలంలో  దిల్ రాజ్ అంచనాలు అటు నిర్మాతగాను ఇటు డిస్ట్రిబ్యూటర్ గా ఫెయిల్ అవుతున్నాయా అంటూ ఇండస్ట్రీ లోని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  

దీనికికారణం ఈమధ్య కాలంలో దిల్ రాజ్ కు నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా  అపజయాల శాతం విపరీతంగా పెరిగింది అన్న విశ్లేషణలు వస్తున్నాయి.మహేష్ బాబు 'మహర్షి' చిత్రానికి  దిల్ రాజ్  సోలో ప్రొడ్యూసర్ కాకపోయినా ఆ సినిమా వల్ల దిల్ రాజ్ కి ప్రత్యేకంగా కలిసివచ్చింది లేదు అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా మొన్న శుక్రువారం విడుదల అయిన చిన్నసినిమా 'ఎవ్వరికీ చెప్పొద్దు' కు మంచి రివ్యూలు వచ్చినా ఈ సినిమాకు జరిగిన  జీరో ప్రమోషన్స్ దెబ్బకు ఆ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి ఎవరికీ తెలియకుండా పోయింది అని అంటున్నారు.   

వాస్తవానికి ఒక కొత్త నిర్మాత తన సినిమా విషయంలో ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటాడు కాని ఇలాంటి పొరపాట్లు దిల్ రాజ్ చేయడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు. దీనికితోడు దిల్ రాజ్ లేటెస్ట్ గా రవిబాబు  'ఆవిరి' చిత్రాన్ని కూడ దిల్ రాజు బ్యానర్ లో రిలీజ్ చేస్తున్నారు.  రవిబాబు తన ప్రయత్నాలతో ఈ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు తప్పించి ఈ మూవీ గురించి దిల్ రాజ్ ఏమి పట్టిచుకోక పోవడం హాట్ టాపిక్ గా మారింది. దీనికితోడు సంక్రాంతికి రాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘ఎంత మంచి వాడవురా’ సినిమాలకు నిర్మాతగా వ్యహరిస్తూ అదే సంక్రాతికి రబోతున్న ‘అలా వైకుంఠపురంలో’ సినిమాను దిల్ రాజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పరిస్థితులలో ఈటెన్సన్స్ మధ్య దిల్ రాజ్ తన ఏకాగ్రతను తప్పుతున్నడా అన్న కామెంట్స్ వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: