‘సైరా’ మూవీతో సురేంద్ర రెడ్డి జాతీయస్థాయి దర్శకుడుగా మారిపోయాడు. ఆ మూవీ కలక్షన్స్ రికార్డులను పక్కకు పెడితే సురేంద్ర రెడ్డిని ఈ మూవీ టాప్ డైరక్టర్స్ లిస్టులో చేర్చింది అన్న విషయం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సురేంద్ర రెడ్డి తనకు ‘సైరా’ లాంటి అద్భుత అవకాశాన్ని ఇచ్చిన చిరంజీవి కంటే ముందుగా తాను కళ్యాణ్ రామ్ కు రుణపడి ఉన్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేంద్ర రెడ్డి తన వ్యక్తిగత జీవితం గురించి అదేవిధంగా తన అభిరుచుల గురించి అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు. తాను మొదటి నుంచి తాను ఎదుటి మనిషిని కాకపడుతూ తిరగడం తనకు అలవాటు లేదనీ అందువల్ల తనకు దర్శకుడుగా అవకాశాలు రావడం చాల కష్టమైంది అన్న అప్పటి విషయాలను వివరించాడు.

అలాంటి పరిస్థితులలో తనను నమ్మి తనకు మొదటి అవకాశం ఇచ్చి ‘అతనొక్కడే’ మూవీ ద్వారా ప్రోత్సహించిన కళ్యాణ్ లేకుంటే ఫిలిం ఇండస్ట్రీలో సురేంద్ర రెడ్డి అనే వ్యక్తి ఉండడని అందువల్ల తాను జీవితాంతం కళ్యాణ్ రామ్ కు రుణపడి ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు కళ్యాణ్ రామ్ కు ‘కిక్ 2’ లాంటి భారీ ఫెయిల్యూర్ తను ఇచ్చినా తనను ఒక్క మాట అనలేదని కళ్యాణ్ రామ్ లాంటి మంచి వ్యక్తులు చాల తక్కువమంది ఇండస్ట్రీలో కనిపిస్తారు అంటూ సురేంద్ర రెడ్డి తన అభిప్రాయాన్ని షేర్ చేస్కున్నాడు. 

దీనితో కళ్యాణ్ రామ్ లేకుంటే తాను దర్శకుడుగా మారలేను కాబట్టి తనకు ‘సైరా’ లాంటి భారీ సినిమా తీసే అవకాశం ఎక్కడ వస్తుంది అంటూ పరోక్షంగా ‘సైరా’ లాంటి భారీ సినిమా తీయడానికి గల కారణం కళ్యాణ్ రామ్ అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. చిన్నతనలో శ్రీదేవి సినిమా చూడటం కోసం తన ఊరు నుండి వరంగల్ కు 40 కిలో మీటర్లు సైకిల్ పై వెళ్ళిన తన అభిమానాన్ని బయటపెడుతూ ఇప్పుడు కలవాలి అని ఉన్నా తాను కలవలేను అంటూ తన బాధను వ్యక్త పరుస్తూ ఇలా ఎన్నో విషయాలు షేర్ చేసాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: