విజయ్ తమిళ్ హీరో అంటే తెలియని వ్యక్తులు ఉండరేమో.. వరుస విజయవంతమైన సినిమాలలో నటించి మంచి పేరును, పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఎంత వరకు అయన సినిమాలు అన్ని సూపర్ డూపర్ సినిమాలుగా నిలిచాయి. ఈయన సినిమా స్టైల్ నచ్చడం వల్ల చాలా మంది ఆయనకు వీరాభిమానులుగా చాలా మంది ఆయనకు నీరాజనం పలుకుతున్నారు. 


విషయానికొస్తే.. విజయ్ నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలే.. గతంలో అట్లీ దర్శకత్వంలో ఇప్పటికే పోలీస్ ఆఫీసర్‌గా, డాక్టర్‌గా చేసిన విజయ్ ప్రస్తుతం ఫుట్‌బాల్ కోచ్‌గా అవతారం ఎత్తుతున్నాడు. అయితే అదొక్కటే ఉంటే దళపతి అభిమానులకు ఇచ్చే ట్రీట్ ఏముంటుంది? అందుకే మరో క్యారెక్టర్‌ను క్రియేట్ చేశాడు. ఒకటి కొంచెం క్లాస్‌గా కనించేలా.. మరొకటి ఊర మాస్ క్యారెక్టర్ ఇలా విజయ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు.


ఒక కోచ్ గా, ప్లేయర్ గా విజయ్ అద్భుతమైన నటన కనబరిచాడు. ఈ విదంగా ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. బిగిల్ సినిమాలో యాక్షన్స్ అన్ని విజయ్ స్థాయిని మరింతగా పెంచుతున్నాయని అందరు నమ్ముతున్నారు. ఈ సినిమాలో నయనతార తో పాటుగా యోగిబాబు కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్నింటిని కలిపి రుచి చూపించారు. ఆడవారికి తగ్గట్లు ఈ సినిమా ఉండబోతుంది. 



అందరు దీపావళికి పటాసుల శబ్దాలు వస్తే.. విజయ్ కి మాత్రం బిగిల్ సినిమా విజిల్స్ తో మారు మోగుతుందని అందరు అభిప్రాయపడుతున్నారు. తమిళంతో పాటు ఈ చిత్రాన్ని అదే రోజును తెలుగులో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రయోగం చేస్తున్న విజయ్ సినిమా ఏ మాత్రం హిట్ అవుతుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: