పునర్నవి ఇలా అంటుంది రాహుల్‌ సిప్లిగంజ్‌ నాకు మంచి స్నేహితుడు. మా ఇద్దరిది స్వచ్ఛమైన స్నేహబంధం. నేను రాహుల్‌తో ప్రేమలో పడ్డాను అని  సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావు అని తెలుపుతుంది. మా గురించి బయట వేరేలా మాట్లాడుకోవడం చూసి నాకు చాలా బాధేసింద’ని చెప్పింది పునర్నవి భూపాలం. 


బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకొచ్చిన పునర్నవి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడం జరిగింది. ఈ రెండున్నర నెలలు కుటుంబం, స్నేహితులను బాగా మిస్‌ అయ్యాను వైల్డ్‌కార్డు ఎంట్రీ అవకాశం వస్తే మాత్రం మళ్లీ ఆనందంగా వెళ్తానని తెలియచేసింది. ఒకవేళ హౌస్‌లో ఉండి ఉంటే తప్పకుండా విన్నర్‌ అవుతుంటీ అని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం  చదువు, సినిమాలే.. పెళ్లి  ఆలోచన మాత్రం  లేదని తెలిపింది.


హౌస్లో అలాగే  ఉండి ఉంటే టైటిల్‌ విన్నర్‌ అయ్యేదాన్నేమో. టాప్‌– 5లో మాత్రం ఉండేదాన్నని అనుకుంటున్నా అని అన్నది పునర్నవి. ఇదొక జీవితానుభవం నాకు . 11 వారాలు 23 ఏళ్ల వయసులో అంతమంది మైండ్‌సెట్‌తో కలిసి ఉండటం గొప్ప విషయమే అని తెలిపింది. వరుణ్, వితిక నామినేట్‌ చేసినప్పుడు కూడా బాధ పడలేదు నవ్వుతూనే ఉన్నాను. నామినేట్‌ చేసినా సరే నాకు అసలు  కోపం రాలేదు. ఇప్పటికీ వారిద్దరిపై స్నేహభావమే ఉంది. ఎలిమినేట్‌ అయ్యేదాకా ఆ ముగ్గురితో స్నేహం బలంగా ఉండేది. నా కోసం రాహుల్‌ త్యాగం చేయడం నాకు బాధను  కలిగించింది అని తెలియచేసింది.


బిగ్‌బాస్‌– 3 టాప్‌– 5లో మాత్రం రాహుల్‌తో పాటు వరుణ్, శ్రీముఖి ఉంటారు అని అనుకుంటున్న అని తెలిపింది. ఎందుకంటే ఈ ముగ్గురు హౌస్‌లో ప్రవర్తించిన తీరు, వారి హావభావాలు, కదలికల్ని దగ్గర్నుంచి చూశాను.  ఇంకా నాకు అవకాశాలు వస్తున్నాయి.. ప్రస్తుతం మతం సైకిల్, చిన్న విరామం సినిమాల్లో పాత్ర పోసిసిస్తున్నాను. అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌తో ఓ సినిమా అవకాశం కూడా వచ్చింది. కథలు వింటున్నాను. ప్రస్తుతం యాక్టింగ్, చదువుపైనే దృష్టి అని తెలియచేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: