తమిళంలో సూపర్ స్టార్ అయిన సూర్యకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన గజిని సినిమా ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనువాద చిత్రంగా విడుదలైన ఈ సినిమా సూర్యకి మంచి పేరు తీసుకురావడంతో పాటు, తెలుగులో మార్కెట్ ని కూడా క్రియేట్ చేసింది. అప్పటి నుండి సూర్య ప్రతీ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అయితే సూర్య గత కొన్ని రోజులుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు.


"గ్యాంగ్" సినిమా నుండి సూర్యకి కలిసి రావట్లేదని చెప్పాలి. గ్యాంగ్ సినిమా ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత వచ్చిన  ఎన్జీకే చిత్ర ఫలితం కూడా అలాగే ఉంది. ఈ రెండు చిత్రాల తర్వాత తెలుగులో సూర్య మార్కెట్ బాగా పడిపోయింది. ఆ విషయం మొన్న రిలీజైన "బందోబస్త్" ద్వారా క్లియర్ గా అర్థమైంది. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజైన ఈ చిత్రానికి తమిళంలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఒక సూపర్ స్టార్ సినిమాకి ఆ మాత్రం ఓపెనింగ్స్ రావడం సాధారణమే.


తెలుగులో మాత్రం ఈ సినిమాకి ఓపెనింగ్స్ సరిగ్గా లేవు. అసలు సూర్య లాంటి స్టార్ హీరోకి ఇలాంటి ఓపెనింగ్స్ వస్తాయా అని ఆశ్చర్యపోయారు. ఓపెనింగ్స్ సరిగా రాకపోవడం అటుంచితే, సినిమా కి సరైన ఆదరణ కూడా దక్కలేదు. దీంతో తెలుగులో సూర్యకి మార్కెట్ పడిపోయిందనే టాక్ వినిపించింది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, తెలుగులో కనీసం వసూళ్ళు కూడా సాధించని ఈ సినిమా తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయింది.


ఈ సందర్భంగా ఈ చిత్ర బృందం సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసుకున్నారు. బందోబస్త్ చిత్రంలో సూర్యతో పాటు ఆర్య కూడా నటించారు. కె వి ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: