ఒక లైలా కోసం చిత్రంలో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ పూజ హిగ్డే . మొదటి సినిమాలు నాగచైతన్య తో జోడీ కట్టిన ఈ అమ్మడు ... ఆ తర్వాత వరుస ఆఫర్లు చేజిక్కించుకుంటూ  ముందుకు దూసుకుపోతోంది. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతి పోగొడుతుంది పూజ. స్టార్ హీరోల సరసన ప్లేస్ కొట్టేసి... డైరెక్టర్స్  అందరికీ వన్ అండ్ ఓన్లీ ఛాయిస్ గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన ఆఫర్లు  అందుకుంటూ... సత్తా చాటుతోంది పూజా హిగ్డే . టాలీవుడ్లో ఏ సినిమాలో చూసినా ఈ అమ్మడే  దర్శనమిస్తోంది... ఇటీవలే విడుదలైన మహేష్ బాబు మహర్షి సినిమాలు మహేష్ బాబు పక్కన మెరిసింది.ఈ  సినిమా మంచి విజయం సాధించింది కూడా. ఇక తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాలో... నటించి  ట్రెడిషనల్ లుక్ తో మెప్పించింది. 

 

 

 

 

 

 అంతే కాకుండా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది ఈ అమ్మడు. ప్రస్తుతం పూజ అల్లు అర్జున్ అల వైకుంఠ పురములో, రెబల్ స్టార్ ప్రభాస్,  దర్శకుడు రాధాకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో , అటు బాలీవుడ్ లో  హౌస్ ఫుల్ 4  సినిమాలో ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. కాగా మీ అమ్మడుకి  తాజాగా మరో ఆఫర్ వచ్చింది. అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలో పూజ హిగ్డే  ఛాన్స్ కొట్టేసింది. అయితే పూజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆశక్తికర విషయాలను బయటపెట్టింది.

 

 

 

 

 

 అదేంటంటే అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు నానా తంటాలు పడుతుంటారు. కాని పూజా హెగ్డే ఇంప్రెస్ చేయడం మాత్రం చాలా ఈజీ  అట. ఫుడ్ లేదా క్యాండిల్ లైట్ డిన్నర్ కు తీసుకెళ్తే పూజ ఇంప్రెస్ అయి పోతుందట. తనొక  ఫుడ్ లవర్ ని.. తన పడేయాలంటే మంచి టేస్టీ ఫుడ్  ఆఫర్ చేస్తే చాలని తెలిపిన పూజా హెగ్డే... దీనికితోడు వినయం ఇంటిలిజెంట్ ఈ రెండు లక్షణాలు కలిగిన అబ్బాయి ఉంటే తను  ఈజీగా ఇంప్రెస్ అయి పోతానని  అని చెప్పింది. అంతేకాకుండా పూజా హెగ్డే ఒకవేళ హీరోయిన్ కాకపోతే ఫోటోగ్రఫీ వైపు వెళ్లెదట.తనలో  తనకి నచ్చేది హైట్, నవ్వు అని చెబుతోంది పూజ. కాగా నేడు పూజ 29 బర్త్ డే  జరుపుకుంటుంది. ఇక నెటిజన్లు పూజా హెగ్డే కి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: