దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 2020 జులై 30వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుండగా జూనియర్ ఎన్టీయార్ కు జోడీగా ఒక బాలీవుడ్ నటి, ఒక హాలీవుడ్ నటి నటిస్తున్నారని సమాచారం. 
 
ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా నెలలే అయినప్పటికీ కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీయార్, చరణ్ కు గాయాలు కావటంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కొంత ఆలస్యం అయింది. ఇలాంటి సమయంలో చరణ్ వలన షూటింగ్ కొంత ఆలస్యం అవుతూ ఉండటంతో రాజమౌళి రామ్ చరణ్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 
 
2018  ఎండింగ్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఆ సమయంలో రామ్ చరణ్ వినయవిధేయరామ షూటింగ్ పనులు, ప్రమోషన్ పనులతో కొంతకాలం బిజీగా ఉన్నాడు. ఆ తరువాత రామ్ చరణ్ సైరా సినిమాకు నిర్మాతగా వ్యవహరించటంతో కొన్ని రోజులు సైరా సినిమా ప్రమోషన్స్ కోసం కేటాయించాడు. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రానికి కూడా రామ్ చరణ్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 
 
అందువలన రాజమౌళి రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలయ్యే వరకు ఈ సినిమా కోసమే పూర్తిగా సమయాన్ని కేటాయించాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కేవలం మూడు లేదా నాలుగు పాటలు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: