టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల వరుసగా విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. కొద్దిరోజుల క్రితం భర్త నాగ చైతన్యతో కలిసి మజిలీ సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్న సమంత, ఇటీవల సోలో హీరోయిన్ గా ఓ బేబీ సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టారు. నిజానికి అంతకుముందే తన పెళ్లి తరువాత రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో నటించి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు సమంత. ఈ విధంగా ఒకదాని తరువాత మరొకటి విజయాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్న ఆమె, 

ప్రస్తుతం శర్వానంద్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఆ సినిమాకు జాన్ అనే టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల తమిళంలో విజయ్ సేతుపతి మరియు త్రిషల కలయికలో వచ్చిన 96 మూవీకి అధికారిక రీమేక్ గా తెరక్కుతున్న ఈ సినిమాను ఒరిజినల్ మాతృకకు దర్శకత్వం వహించిన సి ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తి అయినట్లు సమంత తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒక పోస్ట్ చేస్తూ తెలిపారు. 

నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలారోజుల క్రితమే పూర్తి కావలసింది. అయితే మధ్యలో హీరో శర్వానంద్ భుజానికి గాయం అవడంతో కొన్నాళ్ల పాటు షూటింగ్ ని నిలుపుదల చేసింది సినిమా యూనిట్. టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్న ఈ సినిమాలో తన పాత్ర ఎంతో ఆకట్టుకుంటుందని, తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ సాధించి, తన కెరీర్ కు మరింత ఊపునిస్తుందని అంటోంది సమంత. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: