మెగాస్టార్ చిరంజీవి మరియు సురేందర్ రెడ్డిల కలయికలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్వాతంత్రోద్యమ కథాంశంతో కూడిన సినిమా సైరా నరసింహారెడ్డి. రాయలసీమలోని రేనాడు ప్రాంతానికి చెందిన తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ నిర్మించడం జరిగింది. దాదాపుగా రూ.250 కోట్లకు పైగా అత్యధిక వ్యయంతో ఎంతో భారీ రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా, 

ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో మాత్రం చాలావరకు విఫలమైందనే చెప్పాలి. సినిమాలో మంచి కథ, కథనాలు ఉన్నప్పటికీ, దర్శకుడు సురేందర్ రెడ్డి వాటిని ప్రేక్షక నాడిని పెట్టుకునేలా చిత్రీకరించడంతో చాలా వరకు దెబ్బతిన్నట్లు మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఓవర్ ఆల్ గా యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా, ప్రస్తుతం నత్తనడకన ముందుకు సాగుతూ, పర్వాలేదనిపించేలా కలెక్షన్స్ రాబడుతోంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల చతికిల పడ్డ ఈ సినిమా, 

ప్రస్తుతం నైజాంలో మాత్రం కొంత ఊరటనిచ్చే విధంగా ముందుకు సాగుతోంది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా చాలా పేలవమైన ప్రదర్శన చేస్తున్నట్లు అక్కడి ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం తేటతెల్లం అవుతోంది. ఇక వారి వివరాల ప్రకారం, సైరా సినిమా అక్కడ నీతో అతి కష్టం మీద 10వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా అక్కడ $2.44 మిలియన్ల సాధించగా, రాబోయే రోజుల్లో ఓవర్ అల్ గా 3 మిలియన్ల అందుకోవడం కష్టం అని తేల్చేస్తున్నారు విశ్లేషకులు. కాగా అక్కడ మొదటి పది స్థానాల్లో నిలిచిన సినిమాలు ఏవనగా,

బాహుబలి 2     : $ 20.57 (మిలియన్ డాలర్లలో)
బాహుబలి        : $ 6.86 
రంగస్థలం         : $ 3.51 
భరత్ అనే నేను : $ 3.42 
సాహో              : $ 3.23 
శ్రీమంతుడు       : $ 2.89 
మహానటి          : $ 2.54 
గీతగోవిందం       : $ 2.46
అ ఆ                : $ 2.44 
సైరా                 : $ 2.44
 


మరింత సమాచారం తెలుసుకోండి: