బుల్లితెరపై ఎంతో అలరిస్తున్న షో లలో ఈటీవీ వారి "ఆలీతో సరదాగా" ఎంతగా పేరుగాంచినదో వేరే చెప్పక్కర్లేదు. సినీ తారలకు సంబంధించిన కొన్ని విషయాలు ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. ఇంతవరకు తెలియని కొన్ని విషయాలు స్వయంగా వారే చెబితే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. అది కూడా హీరోహీరోయిన్లుగా ఉండి నిజ జీవితంలో భార్యాభర్తలుగా మారిన వారి సంగతులు మహా ఆసక్తి కలిగిస్తుంటాయి. దినికోసమేనేమో ఈ మధ్య ఆలీ గారు హీరో రాజశేఖర్ భార్య జీవిత గార్ని అతిధిగా ఆహ్వానించారు.. ఆ కార్యక్రమంలో రాజశేఖర్ ధర్మపత్ని జీవిత గారు తన హీరో గురించి ఎం చెప్పారో ఇపుడు చూద్దాం. 

రాజశేఖర్‌తో తన తొలి పరిచయం గురించి మాట్లాడుతూ తమిళంలో తాను చేసిన తొలి సినిమానే మంచి హిట్ కావడంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయని.., అలాంటి పరిస్థితుల్లోనే తెలుగు సినిమా 'తలంబ్రాలు' కోసం ఎమ్మెస్ రెడ్డిగారు తనను తీసుకున్నారని, అదే సినిమాలో యాంటీ హీరోగా రాజశేఖర్ చేశారని జీవిత చెప్పారు. అయితే ఈ సినిమా కంటే ముందే తనకు రాజశేఖర్ తో పరిచయం ఉందని..,, ఈ మేరకు తమ సినీ జీవితంలో జరిగిన ఓ సంఘటన కూడా వివరించారు. ''ఒక తమిళ సినిమాలో రాజశేఖర్ హీరో అయితే నేను హీరోయిన్ గా చేస్తున్నా. మా ఇద్దరిపై కొన్నిరోజుల పాటు కొన్ని సన్నివేశాల షూటింగ్ జరిగింది. అయితే ఓ రోజు రాజశేఖర్ షూటింగుకి రాలేదు. ఏదో కారణం ఉండి ఉంటుంది అందుకే ఆయన షూటింగ్‌కి రాలేకపోయారని అనుకున్నా. కానీ అది వ్యక్తిగత కారణం కాదు.. హీరోయిన్‌ను మార్చేయమని ఆ సినిమా దర్శక నిర్మాతలతో రాజశేఖర్ చెప్పారని ఆ తర్వాత తెలిసింది. కాకపోతే చిరవకు వాళ్లు మార్చేసింది హీరోయిన్‌ని కాదులెండి ఆయననే...,,, అంటూ ఓ తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకొని పక్కున నవ్వేశారు.. తర్వాత కొన్నేళ్ళకు రాజశేఖర్ ఈ విషయాన్ని నాతో చెప్పి తెగ నవ్వుకున్నారు'' అంటూ గత స్మృతులు తెలిపారు జీవిత.

 

మరింత సమాచారం తెలుసుకోండి: