రెండు తెలుగు రాష్ట్రాల్లో మిగతా హీరోయిన్లకు ఉన్న అభిమానులు ఒక ఎత్తైతే శ్రీరెడ్డి కి ఉన్న అభిమానులు ప్రత్యేకం. శ్రీరెడ్డి అనే పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్‌లో అంతలా బీభత్సం సృష్టించింది. పవన్ కళ్యాణ్ ని విమర్శించి అతని అభిమానులతో బుద్ధి చెప్పించుకున్న ఆమె గతకొంత కాలం నుంచి చెన్నైకి చెక్కేయడంతో ఇక్కడ కొంచెం హవా తగ్గింది. అయితే శ్రీరెడ్డి చెన్నైకి వెళ్లినా.. ఆమె మనసు మాత్రం టాలీవుడ్‌ పైనే ఉండటం మన అదృష్టం. సోషల్ మీడియా సాయంతో ఆవిడ ఎప్పుడూ ఎవరి మీద పడుతుందో చెప్పలేం. ఏది గుర్తొస్తో అది.. ఏ మాట వస్తే అదే సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆమె పెట్టే పోస్టులు, వాడే భాష - రాయడానికి తెలుగు భాష సరిపోవట్లేదు అంటే అతిశయోక్తి కాదు. 

మొన్నటి వరకు హీరోయిన్లను తనను పోల్చుకుంటూ కామెంట్లు పెడుతూ ఉండేది. సమంత ఎంత పెద్ద స్టార్ అయినా... ఆమె కంటే తానే అందంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక త్రిషకు సంబంధించిన కామెంట్లతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. పవన్ విషయంలో తిక్కరేగిన అభిమానులు మాత్రం ప్రతీ విషయానికి ఆమెకు నెగెటివ్‌గా కామెంట్లు పెట్టడం.. ఫ్యాన్స్ ఫైర్ అవడం.. ఆమె లెక్కచేయకపోవడం ఓ పరిపాటిగా మారింది.

ఇవన్నీ వదిలేసి ఇపుడు కొత్తగా రజనీకాంత్ ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయ పార్టీ ప్రకటించి వదిలేశారని., అయితే ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండటంతో.. ఇదేమీ సినిమా కాదు సస్పెన్స్ మెయింటెన్ చేయడానికి.. మీరు రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అన్న దానిపై క్లారీటీ ఇవ్వండంటూ ఓ పోస్ట్ పడేసింది. ఒకవేళ రజినీకాంత్ గారు వస్తే.. నేను ఆ పార్టీలో జాయిన్ అవుతాను అంటూ మరో పోస్ట్ పెట్టింది. అయితే శ్రీరెడ్డి వేసిన ఈ స్కెచ్ భలే ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె అనుచరులు. అసలు ఈమె సంగతి తెలిసి రజనీ కాంత్ గారు అవకాశం ఇస్తారా? లేదా అన్నది చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: