ప్రతీ సంవత్సరం సంక్రాంతికి టాలీవుడ్ లో స్టార్స్ తమ సినిమాలతో పోటీ పడటం చాలా కామన్. ఇలా ప్రతిసారి మెగాస్టార్, బాలయ్య, మహేష్ బాబు వంటి వాళ్ళు నటించిన
 2-3 పెద్ద సినిమాలు ఒకేసారి వచ్చిన సందర్భాలున్నాయి. కాకపోతే ఒక్కో సినిమాకి కనీసం ఒకరోజైనా తేడా ఉండేది. కానీ ఈసారి ఈ ఒక్కరోజు గ్యాప్ కూడా లేదు. 2020 సంక్రాంతి బరిలో పోటీపడుతున్న పెద్ద సినిమాలన్నీ ఒకే తేదీకి రిలీజవుతున్నాయి. అంటే ఒకేరోజు ఒకే టైమ్ కు అన్ని సినిమాలు ఒకేసారి తెరమీదకొస్తున్నాయనమాట. ఇది ఇప్పటివరకు ప్రేక్షకులు ఇంతకముందెప్పుడు చూడని అనుభూతి. అంతేకాదు మొదటిరోజు ఏ సినిమా చూడాలో తేల్చుకోలేని అయోమయ పరిస్థితి కూడా ప్రేక్షకుల్లో నెలకొంటుంది.

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతుంది. మొన్నటివరకు ఈ సినిమా విడుదల తేదీపై చిన్నపాటి సస్పెన్స్ కొనసాగింది. అయితే 12వ తేదీ థియేటర్లలోకి రావాలని నిర్ణయించుకొని పోస్టర్ ని వదిలారు. సరిగ్గా బన్నీది కూడా ఇదే సమస్య. మహేష్ బాబు మూవీ కంటే ముందొస్తే క్రేజ్ తగ్గిపోతుందని భయం. పైగా ఈ విషయంలో సంక్రాంతి నెగెటివ్ సెంటిమెంట్ ఒకటి ఉండనే ఉంది. అందుకే బన్నీ కూడా తన సినిమాను 12నే విడుదల చేయాలని నిర్ణయించాడు. కాబట్టే బన్ని కూడా అదే రోజు రావాలని డిసైడయ్యాడు. అందుకే మహేష్ తో పోటీగా బన్ని కూడా డేట్ ని అనౌన్స్ చేస్తు పోస్టర్ ని రిలీజ్ చేశాడు. అయితే ఈ రెండు సినిమాలతో పోటీగా ఇదే రోజుకు కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమా కూడా వస్తోంది. 

బన్నీ, మహేష్ తమ సినిమాల విడుదల తేదీల్ని తాజాగా ప్రకటించారు. కళ్యాణ్ రామ్ ఆ తేదీని ఇంతకముందే లాక్ చేశాడు. ఇతడు కూడా జనవరి 12కే రాబోతున్నాడు. సంక్రాంతి బరిలో ఇలా 3 పెద్ద సినిమాలు ఒకే తేదీకి రావడం ఇదే మొదటిసారి. సంక్రాంతి మార్కెట్ పెద్దదని, 3 సినిమాలు హిట్ అయిన సందర్భాలున్నాయని టాలీవుడ్ మేకర్స్ పైకి చాలా కబుర్లు చెబుతుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఒకేసారి 3 సినిమాలకు థియేటర్లు కేటాయించడం కష్టమనే విషయం తెలిసిందే. 

పైగా ఈ 3 సినిమాల కంటే ముందు రజనీకాంత్ దర్బార్ సినిమా కూడా ఉంది. ఆ సినిమాకి కూడా థియేటర్లు ఇవ్వాల్సిందే. సంక్రాంతికి సీజన్ లో రావాలనుకోవచ్చు తప్పులేదు, కానీ ఇలా అన్నీ సినిమాలు ఒకే తేదీకి రావడం ఖచ్చితంగా పెద్ద ప్రమాదమే. ఈ సినిమాలకే పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుంటే ఇప్పుడు ఇదే సీజన్ కు వెంకీ మామ కూడా రిలీజ్ కి ప్లాన్ జరుగుతుందని మరో టాక్. ఆ సినిమా కూడా సంక్రాంతికే వస్తే భారీ పోటీ మధ్య ఏ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రావన్న టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: