సినిమా పరిశ్రమ అంతా హీరో డామినేషన్ పైనే ఆధారపడి ఉంటుంది. హీరోయిన్లు కూడా ఇదే విషయం ప్రస్తావిస్తూ ఉంటారు. తమకు హీరోలతో సమ ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఉండవనీ, పారితోషికం విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని పలువురు హీరోయిన్లు ఆరోపిస్తూ ఉంటారు. అయితే ఓ సినిమాకు ఓపెనింగ్స్ హీరో మీద ఆధారపడి మాత్రమే వస్తాయి కాబట్టి ఇక్కడ హీరోదే పైచేయి అవుతుంది. దీనిపై మాజీ హీరోయిన్ ప్రియమణి కొన్ని వాఖ్యలు చేసింది.

 

 

 

హీరోయిన్లకు తక్కువ పారితోషికమే ఇస్తూంటారు. వారు డిమాండ్ చేసినా పట్టించుకోరు. దక్షిణాదిలో డిమాండ్ ఉన్న అనుష్క, సమంత, నయనతార మాత్రమే డిమాండ్ చేసి సాధించుకోగలరు కానీ మిగతా ఎవరూ డిమాండ్ చేయలేరని నిర్మాత ఇచ్చింది తీసుకోవడమే అని ఓపెన్ గా చెప్పేసింది. నిజానికి ప్రియమణి చెప్పినదాంట్లో అబద్ధం ఏమీ లేదు.  తమన్నా, కాజల్ వంటి సీనియర్ హీరోయిన్లకు కూడా ఒక ఫిగర్ అమౌంట్ మాత్రమే ఇస్తారు. తమన్నాకు సైరా రూపంలో మంచి పేరు వచ్చింది. అయినా తను డిమాండ్ చేసినంత ఇవ్వరు. గతంలో హీరోయిన్ల పారితోషికం, క్యారెక్టర్లు గురించి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఇటువంటి వాఖ్యలే చేసింది. నిజానికి అనుష్క, సమంత.. హీరోయిన్ ప్రాధాన్యమున్న పాత్రల్లో మెప్పిస్తూ కలెక్షన్లు రాబడుతున్నారు. తెలుగులో వీరిద్దరికీ పోటీ లేదు. తమిళ్ లో నయనతారకు పోటీ లేదు.

 

 

 

లేడి ఓరియెంటెడ్ పాత్రలకు విజయశాంతి తర్వాత ఆ స్థాయి క్రేజ్ తీసుకొచ్చింది అనుష్క అనే చెప్పాలి. దశాబ్దం క్రితం అరుంధతితో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సమంత తెలుగులో ఓ బేబీ తో తన పెర్ఫార్మెన్స్ తోనే సినిమాను హిట్ చేసింది. స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్లు ఉన్నారు కానీ.. క్రౌడ్ పుల్లర్స్ మాత్రం సౌత్ లో ఈ ముగ్గురే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: