తమిళ హీరో  కార్తి నటించిన  లేటెస్ట్ మూవీ ఖైదీ  దీపావళికి  కానుకగా విడుదలకు సిద్ద మవుతుంది. ఇప్పటికే విడుదలైన  తమిళ వెర్షన్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రాగ  తెలుగు వెర్షన్ ట్రైలర్ రేపు విడుదలకానుంది.   ఇక ఈ చిత్రంలో కొన్ని ప్రత్యేకతలు వున్నాయి అవేంటంటే ... హీరోయిన్ మరియు సాంగ్స్  లేకుండా  ఈచిత్రాన్ని తెరకెక్కించారు.  అలాగే ఈ సినిమా  స్టోరీ అంతా ఒక్క రాత్రి లోనే  జరుగుతుంది. 



ఇంటెన్సివ్ యాక్షన్  డ్రామా  నేపథ్యంలో లోకేష్  కనకరాజ్ తెరకెక్కించిన  ఈ చిత్రానికి  సామ్ సీఎస్  అందించిన నేపథ్య సంగీతం అదనపు బలం కానుంది.   కాగా ఈ చిత్రానికి  కోలీవుడ్ లో   పెద్దసవాలే  ఎదురుకానుంది.  స్టార్ హీరో  విజయ్ నటించిన  బిగిల్ కు పోటీగా    ఈ విడుదలవుతుంది ఈ చిత్రం.  బిగిల్  పై ఇప్పటికే  అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.  మరి ఈ చిత్రంతో పోటీ పడి  వసూళ్లను రాబట్టాలంటే  ఖైదీ కి బ్లాక్ బాస్టర్ టాక్ రావాల్సిందే. 



ఇక కార్తి తెలుగులో  హిట్ కొట్టి చాలా  కాలం  అవుతుంది.  గత ఏడాది  కార్తి నటించిన చినబాబు  యావరేజ్ అనిపించుకోగా ఇటీవల విడుదలైన  దేవ్  డిజాస్టర్ అయ్యింది.  అయితే చినబాబు  తమిళ్ వెర్షన్ మాత్రం కోలీవుడ్ లో సూపర్ హిట్ కాగా దేవ్ అక్కడ కూడా డిజాస్టర్ ఫలితాన్ని  చవిచూసింది.  ఇక కార్తి ప్రస్తుతం రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ డైరెక్షన్ లో సుల్తాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో  కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. కోలీవుడ్ లోఆమెకు  ఇదే మొదటి సినిమా. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం  వచ్చే ఏడాది పొంగల్ కానుకగా విడుదలకానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: