యువ హీరో నిఖిల్ ప్రేమలో మునిగితేలుతున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కెరియర్ పరంగా ఇంకా ఒక హిట్టు రెండు ఫ్లాపులుగా సాగిస్తున్న నిఖిల్ ప్రస్తుతం అర్జున్ సురవరం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక లేటెస్ట్ గా తన ప్రేమ విషయంపై నోరు విప్పి అందరికి షాక్ ఇచ్చాడు నిఖిల్.     


మంచి లక్ష్మి చేస్తున్న ఫీట్ అప్ విత్ స్టార్స్ షోలో నిఖిల్ పాల్గొన్నాడు. స్టార్స్ బెడ్ రూం సీక్రెట్స్ తో ఈ షో నడుస్తుంది. నిఖిల్ తో మంచు లక్ష్మి చిట్ చాట్ చేశారు. తనకు ఓ డాక్టర్ తో రిలేషన్ ఉందని.. తన జీవితంలో ఆ అమ్మాయి చాలా స్పెషల్ అని అంటున్నాడు నిఖిల్. నన్ను బాగా అర్ధం చేసుకున్న అమ్మాయి తనే అని.. తను బిజీగా ఉన్నా, స్నేహితులతో ఉన్నా అసలు డిస్ట్రబ్ చేయదని. ఫోన్ కూడా చెక్ చేయదని అన్నాడు నిఖిల్.  


ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుందని తను బాగా నమ్ముతుంది. అందుకే తనని అసలు ఏమాత్రం డిస్ట్రబ్ చేయదని అంటున్నాడు. అయితే ఆ అమ్మాయి ఎవరో త్వరలో తెలుస్తుందని చెబుతున్నాడు. షారుఖ్ ఖాన్ సినిమాలంటే ఇష్టమన్న నిఖిల్ ఆయన సినిమాల వల్లే ప్రేమించి పెళ్లాడాలని ఫిక్స్ అయినట్టు చెప్పుకొచ్చారు. 


మరి నిఖిల్ మనసు గెలుచుకున్న ఆ డాక్టర్ పిల్ల ఎవరో అని ఇప్పటికే వెతకడం మొదలు పెట్టారు. ఏదో ఒకరోజు సర్ ప్రైజ్ గా నిఖిల్ కూడా ఎంగేజ్మెంట్ పిక్స్ షేర్ చేసి షాక్ ఇచ్చేలా ఉన్నాడు. యువ హీరోగా తన సత్తా చాటాలని చూస్తున్న నిఖిల్ కు సరైన ఛాన్స్ రావాలే కాని తానేంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. అర్జున్ సురవరం సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. మరి ఆ సినిమాతో అయినా నిఖిల్ మళ్లీ ఫాం లోకి వస్తాడేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: