ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది జబర్దస్త్. ఇక జబర్దస్త్ చూస్తున్న ప్రేక్షకులందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది  జబర్దస్త్ కామెడీ షో. జబర్దస్త్ షో స్టార్ట్ అయింది అంటే చాలు టీవీ కి అతుక్కుపోతారు ప్రేక్షకులు. అయితే జబర్దస్త్ కి  వచ్చిన కమెడియన్స్ కి చాలా క్రేజ్ వస్తుంది. అందుకే ఒక్కసారి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తే చాలు అనుకుంటారు అప్కమింగ్ కమెడియన్స్. అయితే జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి ఉన్నవాళ్లలో  బాగా క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్స్ లలో  మొదటి వరుసలో ఉండేది గెటప్ శీను. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి  డిఫరెంట్ గెటప్స్ తో ప్రేక్షకులకు నవ్వులు పంచాడు గెటప్ శీను. ఎలాంటి గెటప్ వేసిన ఆ గెటప్ లో  నటించడం కాదు జీవిస్తాడు గెటప్ శీను. అందుకే ఏకంగా ప్రేక్షకులు అతని  శ్రీను అని కాకుండా గెటప్ శ్రీను అని  పిలుచుకుంటారు. 

 

 

 

 

 

 అయితే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ ఐన గెటప్ శీను సినిమాల్లో కూడా చాలా అవకాశాలు దక్కించుకున్నాడు . అయితే తాజాగా గెటప్ శీను బంపర్ ఆఫర్ కొట్టేసాడు . మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో గెటప్ శీను ఛాన్స్ కొట్టేసినట్టు  సమాచారం. అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన లేనప్పటికీ గెటప్ శ్రీను  మాత్రం సంకేతాలు అందాయని స్వయంగా వెల్లడించాడు. ఇటీవలె జబర్దస్త్ టీంతో చిరంజీవిని గెటప్ శీను కలిసేందుకు వెళ్ళినప్పుడు... కొరటాల శివ  సినిమాలో నీకు ఒక మంచి పాత్రని  అనుకున్నారని  మెగాస్టార్ చిరంజీవి  చెప్పగానే  చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను  అని తెలిపాడు గెటప్ శ్రీను . 

 

 

 

 

 మెగాస్టార్ చిరంజీవి 152 వ  సినిమాలో నటించడం కంటే అదృష్టం ఏముంటుందని గెటప్ శీను తెలిపాడు. అయితే అధికారికంగా మాత్రం ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉందని గెటప్ శీను తెలిపాడు. ఇదిలా ఉంటే ఇటీవలే  మెగా బ్రదర్ జబర్దస్త్ జడ్జి  నాగబాబు కూడా గెటప్ శీను పై ప్రశంసల వర్షం కురిపించాడు. గెటప్ శ్రీను  లాంటి నటుడిని  ఇండస్ట్రీ వాడుకోకపోతే నష్టపోతుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నటించగల సత్తా గెటప్ శీను ఉందని ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశాడు మెగా బ్రదర్ నాగబాబు. కాగా ప్రస్తుతం  గెటప్ శ్రీను త్రి  మంకీస్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: