ఈసారి సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు అలా ఫిక్స్ అయిపోయాయి. వాటిలో ఒకటి మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, మరొకటి త్రివిక్రం బన్నీ కాంబోలో వస్తున్న అల వైకుంఠపురంలో. ఈ రెండు మూవీస్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ రెండు మూవీస్ దాగుడుమూతలు బాగా ఆడాయి. చివరికి కలసికట్టుగా ఒకే డేట్ కి తోసుకుని మరీ వ‌చ్చిపడుతున్నాయి.


దానికి అనేక కారణాలు చెబుతున్నారు. సంక్రాంతి ఈసారి 15వ తేదీ బుధవారం వచ్చింది. అంటే సంక్రాంతి  కనీసం మూడు రోజుల గ్యాప్ లో  రావాలని మాత్రమే ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఎక్కువ రోజుల గ్యాప్ ఉంచుకుని రిలీజ్ చాస్తే ఆలస్యంగా వచ్చిన కొత్త సినిమా కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి. దాంతో ముందు వచ్చిన సినిమా చప్పబడిపోతోంది. ఇదో సెంటిమెంట్ లా తయారైంది.


ఈ రకమైన ట్రెండ్ చాలా ఏళ్ళుగా సాగుతోంది. దాంతో జాగ్రత్త పడిన మహేష్, బన్నీ నిర్మాతలు జనవరి 12నే రిలీజ్ అంటూ డిసైడ్ అయిపోయారు. ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రావడం వల్ల అదీ  సంక్రాంతి వేళ లాభం నష్టం ఏంటన్నది ఇకపై చూడబోతామన్నమాట. నిజానికి సంక్రాంతికి వారం ముందు నుంచి సెలవులు ఇస్తారు. అయితే అంతా వూరి ప్రయాణాల్లో ఉండడం వల్ల కొత్త సినిమా వారం ముందు రిలీజ్ కొట్టినా కేవలం ఫ్యాన్స్ మాత్రమే చూస్తున్నారు.


సరిగ్గా అంతా వూళ్ళకి వెళ్ళి  సర్దుకున్న వేళ థియేటర్లలో పడిన బొమ్మకే ఆదరణ వస్తోంది. దాంతో నలుగురు చూసేసి టాక్ పాజిటివ్ గా వస్తే బిగ్ హిట్ అవుతోంది. దాంతో తోసుకుని మరీ మహేష్, బన్నీ లేటుగా వస్తున్నారు. మరి చూడాలి ఎవరు పెద్ద హిట్ కొడతారో. దీంతో యమ టెన్షన్ మొదలైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: