బిగ్ బాస్ హౌజ్ సీజన్ 3లో రాహుల్, పునర్నవిల మ్యాటర్ గురించి అందరికి తెలిసిందే. ఇద్దరి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. హోస్ట్ గా ఉన్న నాగార్జున అయితే రాహుల్, పునర్నవిలది లవ్ అని కన్ఫాం చేశాడు. రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ టైంలో పునర్నవి చాలా ఎమోషనల్ అవగా.. రాహుల్ రీ ఎంట్రీ తర్వాత వారి మధ్య బాండింగ్ మరింత పెరిగింది.


ఇక లాస్ట్ వీక్ పునర్నవి నామినేషన్ తర్వాత రాహుల్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. ఆమె మీద ఉన్న అభిమానం, ప్రేమను చూపించాడు. అయితే పునర్నవి వెళ్లి వారం అవుతుంది. ఈ వారం ఎలిమినేషన్స్ లో మహేష్ కూడా బయటకు వెళ్లాడు. ఇదిలాఉంటే ఈ ఆదివారం ఎపిసోడ్ లో నాగ్ ఇచ్చిన అమ్మతోడు అంతా నిజమే చెబుతా గేమ్ లో బిగ్ బాస్ ఇంట్లో ఎవరి మీద అయినా మనసు పారేసుకున్నారా అంటూ ప్రశ్న అడుగుతాడు.  


దానికి అందరు రాహుల్ వైపే చూశారు. రాహుల్ కూడా నాగార్జునను ఉద్దేశించి నేను చెప్పేది ఏముంది సార్.. మీరు చూస్తూనే ఉన్నారుగా అనేశాడు. అంటే రాహుల్ ఇంకా పునర్నవి మీద అదే ఫీలింగ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. అయితే పునర్నవి మాత్రం రాహుల్ తో ఉన్న రిలేషన్ పై క్లారిటీ ఇచ్చింది. తామిద్దరం మంచి స్నేహితులుగా ఉందామనే అనుకున్నామని అంటుంది. 


ఒకవేళ బయటకు వచ్చాక రాహుల్ లవ్ ప్రపోజల్ చేసినా తను మాత్రం ఒప్పుకోనని అంటుంది పునర్నవి. మరి హౌజ్ లో రాహుల్ మాత్రం ఇంకా ఆమె మీద ప్రేమతో ఉన్నట్టు చెబుతున్నాడు. మరి మూడు వారాలే ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చాక రాహుల్, పునర్నవిల రిలేషన్ ఎలా ఉంటుందో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 1 లో ప్రిన్స్, దీక్షా.. సీజన్ 2లో తనీష్, దీప్తి సునైనా.. ఈ సీజన్ లో రాహుల్, పునర్నవి ఇలా ప్రతి సీజన్ లో ఇలాంటి ఓ లవ్ స్టోరీ ఉండాల్సిందే అన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: