మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీనంబర్ 150 సినిమాకి వి.వి వినాయక్ దర్శకత్వం వహించారు. అయితే వినాయక్ గతంలో ఠాగూర్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కించుకున్నాడు కాబట్టి అతనికి పెద్ద సర్‌ప్రైజ్ ఏమీ కాదు. కానీ రీ ఎంట్రీ మూకి ఛాన్స్ వచ్చిన విషయం మాత్రం వినాయక్ కాస్త ఎగ్జైట్ అయ్యో విషయమే. ఇక రీసెంట్‌గా మెగాస్టార్ 151వ సినిమా సైరా-నరసింహారెడ్డికి సురేందర్ రెడ్డి అనూహ్యంగా గోల్డెన్ ఛాన్స్ లాంటి అవకాశం దక్కించుకున్నారు. ధృవ సినిమాతో తానేంటో నిరూపించుకున్న సురేందర్ రెడ్డికి 300 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించే అదృష్టం దక్కింది. మెగాస్టార్ అంతటివారినే డైరెక్ట్ చేస్తానని సురేందర్ రెడ్డి కలలో కూడా ఊహించి ఉండడు. ఇక చిరు నటిస్తున్న 152వ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించే ఛాన్స్ ఎప్పుడో కొట్టేశారు. 

వరుస బ్లాక్ బస్టర్లతో శివ సంచలనాలు సృష్టిస్తుండడంతో మెగాస్టార్ తో అవకాశం రావడం శివ కి జాక్ పాట్ అని చెప్పాలి. వాస్తవంగా చూస్తే ఎన్నో సినిమాలను తెరకెక్కించిన కొంతమంది టాప్ డైరెక్టర్స్ కి ఇప్పటి వరకు చిరును డైరెక్ట్ చేసే ఛాన్స్ రానే లేదు. వాళ్ళతో చూస్తే ఈ ముగ్గురిది లక్కి ఛాన్స్ అనాలి. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఇంకో దర్శకుడి పేరు చేరింది. ఆ డైరెక్టరే సుకుమార్. ఈ లెక్కల మాస్టార్ ట్యాలెంట్ ఏమిటో రంగస్థలం సినిమాతో మరోసారి రుజువైంది. ఆర్య ఫ్రాంఛైజీ సహా నాన్నకు ప్రేమతో లాంటి బ్లాక్ బస్టర్ తోనూ సుక్కూ తన సత్తా చాటాడు. ఇక రామ్ చరణ్ కి అంతకుముందు ఉన్న పాత ఇమేజ్ ని పూర్తిగా చెరిపేసి రంగస్థలం సినిమాలో ఇండస్ట్రీ సెన్సేషనల్ హిట్ ని ఇచ్చాడు.  

అంతేకాదు చరణ్ కి కెరీర్ లో మగధీర తర్వాత అంతకి రెండింతలు గొప్పగా నిలిచిపోయో సినిమాని ఇచ్చాడు. అంతేకాదు 100కోట్ల షేర్ క్లబ్ లో చరణ్ పేరును చేర్చాడు. అంత టాలెంట్ ఉంది గనకే మెగాస్టార్ వెంటనే సుక్కూకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని.. మెగాస్టార్ 153 సుకుమార్ డైరెక్ట్ చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఇక మెగాస్టార్   సైరాను నిర్మించిన రామ్ చరణ్ ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా మోహన్ లాల్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్కి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టు.. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఏపీ పొలిటికల్ సిట్యుయేషన్ కి తగ్గట్టుగా కథాంశాన్ని మార్చి తెరకెక్కిస్తారని లేటెస్ట్ న్యూస్. అయితే సుకుమార్ ఎంపికకు సంబంధించి కొణిదెల కాంపౌండ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం రాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: