టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక అక్కడి నుండి తాను స్థాపించిన జనసేన పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమైన పవన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన జనసేనపార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనంతరం ఇకపై పూర్తిగా తన పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని, అలానే పార్టీని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని సంకల్పించిన పవన్, ప్రస్తుతం ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. 

అయితే ఆయన మళ్లీ తిరిగి సినిమాల్లో రానున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ, అవన్నీ నిజం కాదు ఒట్టి పుకార్లే అని మధ్యలో కొందరు కొట్టిపారేయడం జరిగింది. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక భారీ సినిమా ప్రారంభం కాబోతోందని, ఒక బడా టాలీవుడ్ నిర్మాణ సంస్థ దానిని నిర్మించబోతోందని సమాచారం. అలానే దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ఎంతో రహస్యంగా కొద్ది రోజుల నుండి జరుగుతోందని కూడా అంటున్నారు. 

ఇక ఇటీవల కొద్దిరోజుల నుండి వెన్నునొప్పితో బాధపడుతున్న పవన్, దానికి చికిత్స చేయించుకుని పూర్తిగా కోలుకున్న తర్వాతనే సినిమాను ప్రారంభిస్తారని చెప్తున్నారు. ఈ విషయాన్ని ముందే లీక్ చేయకుండా ఒకేసారి అందర్నీ సినిమా ప్రారంభం సమయానికి సర్ప్రైజ్ చేద్దామని ఆ సినిమా నిర్మాతలు భావించారట, అందుకే ఈ విషయమై ఎక్కడా కూడా అధికారిక న్యూస్ బయటకు రాలేదని అంటున్నారు. ఒక ఫేమస్ డైరెక్టర్ తెరకెక్కించబోయే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని, ఈ సినిమాతో పవన్ కు నటుడిగా మరింత మంచి గుర్తింపు రావడం ఖాయమని టాక్. మరి ప్రస్తుతం విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: