డైరెక్టర్ రవిబాబు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్ ఉంది. అల్లరి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్న రవిబాబు.. ఆ తరవాత కూడా తన మార్కు కొనసాగించాడు. ఆ సినిమా జయాపజాలతో సంబంధం లేకుండా రవిబాబు సినిమా అంటే ఎదురు చూసేలా చేయడం ఆయన స్పెషాలిటీ.


ఆయన ఇటీవల ఎక్కువగా థ్రిల్లర్ జోనర్ లో సినిమాలు చేస్తున్నారు. రవి బాబు సినిమాలో విలన్లు ఎక్కువగా శాడిస్టులు ఉంటారు. అయితే నిజ జీవితంలో తానూ కాస్త శాడిస్టునే అంటున్నారు డైరెక్టర్ రవిబాబు. ఆయన తన శాడిజం ఆలోచనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.


అవేంటంటే..చిన్నప్పుడు ఎవరైనా ఫలానాది వద్దంటే.. అదే చేసేవాడట.. చిన్నప్పుడు చెన్నైలో వాళ్ల ఇంటి ఆవరణలో ఓ మామిడి చెట్టుండేది. ఇంటి ఓనర్ మామిడికాయలు కోయకూడదని రూల్ పెంట్టిందట. అందుకే ఆమె బయటికెళ్లగానే కాయలు తెంపేవాడట రవిబాబు. వాళ్ల నాయనమ్మ అతిగా స్వీట్లు తినొద్దని మిఠాయిలు లాకర్లో పెట్టేదట. ఆమె బయటికెళ్లగానే.. స్క్రూడ్రైవర్ తో లాకర్ ఓపెన్ చేసి మరీ స్వీట్లు తినేవాడట. ఇలా విపరీతమైన అల్లరి చేసేవాడట.


చిన్నతనంలో కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు.. రవిబాబు వాళ్ల కజిన్ ముక్కు పొడవుగా ఉండేదట. రవిబాబు వాడి ముక్కులోకి ఓ పుల్లని బలవంతంగా ఎక్కించాడట. వాడు ముక్కులోంచి రక్తం వస్తూ లబోదిబోమన్నాడట. ఇక రవిబాబు పరార్.. ఈ శాడిజం, అల్లరి పెద్దయ్యాక కూడ కొనసాగిందట. పుణేలో ఎంబీఏ చదివే రోజుల్లో ఓ ఐలాండ్ కి స్నేహితుడితో కలిసి వెళ్లాడట. ఇద్దరూ మాట్లాడుకుని చెరోవైపు వెళ్లి ట్రాఫిక్ అంతా ఒక వైపునకే మళ్లించారట. దీంతోమెయిన్ రోడ్డందా బ్లాక్ అయి విపరీతమైన ట్రాఫిక్ జామయ్యిందట.అలా చేసినప్పుడు ఓ పిచ్చి ఆనందం ఉండేదంటున్నాడు రవిబాబు. ఇప్పుడాలోచిస్తే అంత సిల్లీగా చేశానా అని నవ్వొస్తుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: