టాలీవుడ్ సినిమా పరిశ్రమకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ, అంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలకు కథలను అందించడం జరిగింది. అయితే దర్శకుడిగా తెరకెక్కించిన తొలి చిత్రం కొరటాలకు సూపర్ హిట్ ను అందించింది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు సినిమా చేసిన కొరటాల, దానితో ఏకంగా పెద్ద ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ తో తీసిన గ్యారేజ్ కూడా హిట్ అవడం, అలానే ఇటీవల మళ్ళి మహేష్ బాబుతో కలిసి ఆయన తీసిన భరత్ అనే నేను మరొక పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడంతో, కెరీర్ పరంగా ఇప్పటి వరకు ఒక్క అపజయం కూడా చవిచూడలేదు కొరటాల శివ. 

ఇక అతి త్వరలో మెగాస్టార్ హీరోగా ఒక సినిమాని ఆయనలో తెరకెక్కించనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ ఎంతో స్టైలిష్ గా మరియు పవర్ ఫుల్ గా ఉంటుందని, అలానే ఈ సినిమాలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడంటూ కొద్దీ రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే అది నిజమేనని, కాగా దానికి ఒక కారణం కూడా ఉందని అంటున్నారు. అదేంటంటే, గతంలో కొరటాల శివ దర్శకత్వంలో చరణ్ హీరోగా ఒక సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుని, షూటింగ్ మొదలెట్టకుండానే మధ్యలోనే అర్ధంతరంగా ఆగిపోయింది. 

ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు చరణ్ తో సినిమా చేసే అవకాశం లభించని కొరటాల, ప్రస్తుతం మెగాస్టార్ తో చేస్తున్న సినిమాలో చరణ్ కు కూడా ఒక మంచి పాత్ర ఇచ్చి, ఆ విధంగా ఒకేసారి తండ్రి తనయులను ఇద్దరిని దర్శకత్వం వహించేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే దీని పై ఆ సినిమా యూనిట్ నుండి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేనప్పటికీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా దొరికినట్లే అంటున్నారు సినిమా విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: